Breaking News

Daily Archives: July 10, 2017

దత్తత పాఠశాలకు 5 వేల విరాళం

  బీర్కూర్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు నసురుల్లాబాద్‌ దత్తత తీసుకున్న యుపిఎస్‌ మైలారం పాఠశాలకు నసురుల్లాబాద్‌ పిఆర్‌టియు ప్రధాన కార్యదర్శి మదన్‌సింగ్‌ రూ. 5 వేలు విరాళం అందజేశారు. గ్రామ పెద్దలు ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటిసి మహేందర్‌లకు నగదు అందజేశారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి పిఆర్‌టియు కృషి చేయడం అభినందనీయమని పెద్దలన్నారు. పిఆర్‌టియు అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ చిన్న చిన్న పనులు తప్ప అన్ని పనులు పూర్తికావచ్చాయన్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ సందర్శించే అవకాశముందన్నారు. కార్యక్రమంలో తెరాస ...

Read More »

మహిళల భద్రత కొరకే షీ టీం

  నందిపేట, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రత, రక్షణ కొరకే షీ టీం పనిచేస్తుందని షీ టీం ఆర్మూర్‌ ఏఎస్‌ఐ నరేందర్‌ పేర్కొన్నారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలోని శ్రీసాయి జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల నుద్దేశించిమాట్లాడారు. పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు, అందులో భాగంగానే నందిపేటలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు మహిళలను, విద్యార్థినిలను, యువతులను వేధించినా, సెల్‌ఫోన్‌ల ...

Read More »

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం అధ్యక్షునిగా రోశయ్య

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షునిగా కుమ్మరి రోశయ్యను నియమించారు. ఈ మేరకు రోశయ్యకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్సక్‌ బిఇడి కళాశాలలో సోమవారం నియామక పత్రాన్ని జాగృతి జిల్లా అధ్యక్షుడు సి.హెచ్‌.అనంతరాములు అందజేశారు. జాగృతి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షునిగా రోశయ్యను ఎంపిక చేసినట్టు తెలిపారు. రోశయ్య మాట్లాడుతూ తనపై ననమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు జాగృతి విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. ...

Read More »

అంగన్‌వాడిల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐసిడిఎస్‌ను కోర్‌ ఆఫ్‌ కోర్‌ స్కీంగా మార్చాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడి కేంద్రాల విలీనం తక్షణమే ఆపాలని, జివో నెం 14 సవరించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం అంగన్‌వాడి టీచర్లు కామారెడ్డి జిల్లాకలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. సిఐటియు అనుబంధం తెలంగాణ అంగన్‌వాడి వర్కర్స్‌ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. గత ఆరేళ్ల నుండి కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడిలకు వేతనాలు ...

Read More »

మిషన్‌ భగీరథ, కాకతీయ పనుల్లో నాణ్యతలేమిపై ఆగ్రహం

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యత లోపించిందని, కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారని ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు ఆరోపించారు. సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహిస్తున్న పనుల్లో నాణ్యతలేమి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో చెరువుల్లో కట్టిన తూములు పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇదంతా చూస్తున్న ...

Read More »

విద్యార్థులకు యోగా తరగతులు

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వాసవీ పబ్లిక్‌ పాఠశాలలో విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. యోగా గురువు బండి రాములు ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా పాఠాలు బోధిస్తున్నారు. యోగాభ్యాసం వల్ల విద్యార్థులు మనస్సును, దృష్టిని చదువుపై కేంద్రీకృతం చేసి లక్ష్యాలను సాధించగలుగుతారని, అందుకు యోగా ఉపయోగపడుతుందని రాములు పేర్కొన్నారు. విద్యార్థులు యోగా పట్ల మక్కువ చూపుతున్నారు.

Read More »

క్షతగాత్రులను పరామర్శించిన ఎంపి, ఎమ్మెల్యే,

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ వద్ద బస్సు ప్రమాదఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను సోమవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో జహీరబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు పరామర్శించారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటిగౌడ్‌, కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్‌స్వామిలను పరామర్శించారు. వారిని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ఓదార్పునిచ్చారు. వారి వెంట ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, ఫుడ్‌ సెక్యురిటీ ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డి, జడ్పిటిసి తానాజీరావు, తదితరులున్నారు.

Read More »

టిజివిపి రాష్ట్ర కార్యదర్శిగా నవీన్‌

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శిగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఎనుగందుల నవీన్‌ ను నియమిస్తూ టిజివిపి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీహరి ఉత్తర్వులు అందజేశారు. ఈనెల 8,9 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన టిజివిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవీన్‌ రెండు సంవత్సరాల పాటుగా కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శితో పాటు ...

Read More »

ప్రజావాణిలో 59 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 59 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాలలు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. స్వీకరించిన పిర్యాదులను కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులకు పంపారు. ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కారమయ్యే లాచూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read More »