Breaking News

గోర్గల్‌లో బోనాల పండగ

 

నిజాంసాగర్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామంలో నల్లపోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండగ నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిమీద పెట్టుకొని భాజా భజంత్రీలతో వీధుల్లో ఊరేగించారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అక్కడే వనభోజనాలు సిద్దంచేసుకొని తిన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మొక్కుకున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article