Breaking News

రోగాలబారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు

 

నిజాంసాగర్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపిడివో రాములు నాయక్‌ పంచాయతీ కార్యదర్శులను, కారోబార్లను ఆదేశించారు. నిజాంసాగర్‌ ఎంపిడివో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని వాటర్‌ ట్యాంకులను వారానికి ఒకసారి క్లోరినేషన్‌ చేయించాలన్నారు. వాటర్‌ ట్యాంకుల ద్వారా ప్రజలకు సరఫరా అయ్యే పైప్‌లైన్ల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున నీటివల్ల ప్రజలకు వాంతులు, విరేచనాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి, కుళాయి బకాయిలు వంద శాతం వసూలు చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. సమావేశంలో కార్యదర్శులు అదికారులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article