Breaking News

Daily Archives: July 12, 2017

చెట్లతోనే మానవాళి మనుగడ

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గాంధారి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లతోనే మానవాళి మనుగడ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం హరితహరం కార్యక్రమాన్ని గాంధారి మండలంలో మొక్కలునాటి ప్రారంభించారు. మండలంలోని మాదవ్‌పల్లిలో మొక్కలునాటి నీరుపోశారు. అందరిచేత మొక్కలు నాటించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు 5 మొక్కల చొప్పున నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చెట్ల ఆవశ్యకత మానవాళికి ఎంత అవసరమో వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు ...

Read More »

ఎస్పీ కార్యాలయంలో హరితహారం

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడో విడత హరితహారంలోభాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 75 మొక్కలు నాటారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డితోపాటు సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన పెద్దలు ప్రకృతికి అనుకూలంగా నడిచారని, పర్యావరణం కాపాడారన్నారు. ప్రస్తుతం ప్రకృతి వ్యతిరేకంగా నడుచుకుంటూ అనేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలునాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Read More »

మధ్యాహ్న భోజనం పరిశీలన

  నిజాంసాగర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ గ్రామ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప బుధవారం పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని వారానికి మూడు కోడిగుడ్లను అందజేయాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ తరఫున మరో నీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Read More »

ప్రతి మొక్కకు నీరుపోయండి

  నిజాంసాగర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మొక్కకు నీరు పోసి సంరక్షించాలని, ప్రతి వ్యక్తి పదిమొక్కలు నాటి సంరక్షించాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి, నాందేడ్‌-అకోల రహదారిలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో హరితహారం పథకం వేగవంతంగా కొనసాగుతుందని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. తెలంగాణలో అడవులు 20 శాతం ఉండడంతో హరితహారంలో ...

Read More »

విద్యుత్‌షాక్‌తో టివిలు దగ్దం

  నిజాంసాగర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్‌ షాక్‌తో సుమారు 16 ఇల్లలోని టివిలు, 11 విద్యుత్‌ మీటర్లతో, ఇతర ఎలక్రికల్‌ వస్తువులు దగ్దమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎడిఎ వినోద్‌గౌడ్‌ మహ్మద్‌నగర్‌ గ్రామాన్ని సందర్శించారు. రెండు విద్యుత్‌ తీగలు కలవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.

Read More »

ఎమ్మెల్యేను కలిసిన జర్నలిస్టు ప్రతినిదులు

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను బుధవారం టియుడబ్ల్యుజె ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు జర్నలిస్టుల సమస్యలను విన్నవించారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించొద్దని, అక్రిడేషన్లు మంజూరు చేయలని, మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు చేయూతనివ్వాలని, హెల్త్‌కార్డులు అందజేయాలని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు మంజూరు చేయాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు లతీఫ్‌, శ్రీనివాస్‌, వెంకన్న, రజనీకాంత్‌, ప్రభాకర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మహిళా సంఘాలను బలోపేతం చేయాలి

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాలను బలోపేతంచేయాలని, ఇందుకోసం స్వచ్చంద సంస్థలు, మహిళా సంక్షేమాధికారులు కృసి చేయాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో రూడ్‌బన్‌ పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు బహిష్టు సమయంలో సమస్యలు ఎదుర్కొవడమే గాక వివిధ సాదనాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయం పట్ల మహిళల్లో అవగాహన కల్పించి తక్కువ ఖర్చుతో నాఫ్‌కిన్లు తయారుచేసేవిధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందుకోసం సహాయ ...

Read More »

హరితతెలంగాణగా మార్చేందుకు సమష్టి కృషి

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాస్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడో విడత హరితహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ఐ కాంపౌండ్‌, డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలునాటారు. డిగ్రీ కళాశాలలో ఒకేరోజు 7200 మొక్కలను విద్యార్థులు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో ఆ ప్రకృతి ...

Read More »

జర్నలిస్టుల రక్తదానం

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యు జెఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జర్నలిస్టులు రక్తదానం చేశారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టిడబ్ల్యుజెఎఫ్‌ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు వేణు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నలుగురు జర్నలిస్టులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌.కె.చారి, విజయానంద్‌, కరుణాకర్‌, సిద్దాగౌడ్‌, సాయి, వెంకటేశం, సాయిలు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »