Breaking News

హరితహారంలో నిజాంసాగర్‌ ప్రథమస్థానం

 

నిజాంసాగర్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో హరితహారం జోరుగా చేపట్టి జిల్లా అధికారుల ప్రశంసలు మండల అధికారులు పొందారు. గత వారంరోజుల క్రితం ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే 17 గ్రామ పంచాయతీలో 3 లక్షలు మొక్కలు మండలంలో నాటించారు. కూలీలకు కూడా డబ్బులు సైతం 50 శాతానికి పైగా అందించేలా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్‌ గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంపిడివో రాములు నాయక్‌కు ఉత్తమ ఎంపిడివోగా, జేసి సత్తయ్య, పిడి మదన్‌మోహన్‌ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఎపివో సుదర్శన్‌, సాంకేతిక సహాయకురాలు జయశ్రీ, బాల్‌సింగ్‌, ప్రభాకర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌ ఉత్తమ ఉద్యోగులుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాలు పొందారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article