Breaking News

కళాశాల ఏర్పడే వరకు పోరాటం ఆగదు

 

నందిపేట, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ బస్టాండ్‌ ఎదుట టిడిపి చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. మండలంలోని మూడు కళాశాలల నుంచి ప్రతి సంవత్సరం 500మంది విద్యార్థులు ఇంటర్‌ పూర్తిచేస్తున్నందున డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరముందన్నారు. కెజి నుంచి పిజి లో అందరికి ఉచిత విద్య అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క కళాశాల ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. కళాశాల ఏర్పాటయ్యే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అధికారులు వెంటనే స్పందించి కళాశాల మంజూరు చేయాలని కోరారు. లేకుంటే అన్ని రాజకీయ పార్టీలను, విద్యార్థులను ఏకం చేసి అఖిలపక్షం ద్వారా పోరాడి డిగ్రీ కళాశాల సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కచ్చకాయల రాజేశ్వర్‌, కార్యదర్శి జావిద్‌, జిల్లా నాయకులు యాదాగౌడ్‌, జ్యోతి నారాయణ, దంతాల ఆనంద్‌, కాటిపల్లి గంగారెడ్డి, మన్నె సాగర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

One comment

  1. SHAIK GHOUSE

    మంచి పోరాటం

Comment on the article