Breaking News

రాజారాం యాదవ్‌ తీరు సరిగా లేదు

 

నందిపేట, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ సీనియర్‌ నాయకులను పట్టించుకోవడం లేదని, ఆయన తీరును నిరసిస్తూ సోమవారం టిడిపి ఆద్వర్యంలో డిగ్రీ కళాశాల సాదన కొరకు చేపట్టిన ధర్నాను బహిష్కరించామని పార్టీ సీనియర్‌ నాయకులు శంకర్‌, గంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత మూడేళ్ళుగా తమను పట్టించుకోవడం లేదని, ఎవరితో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. రెండు నెలల క్రితం టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వచ్చినపుడు కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కార్యక్రమం చేశాడన్నారు. అదేవిధంగా సోమవారం చేపట్టిన డిగ్రీ కళాశాల సాధన ధర్నాలో సీనియర్‌లను పిలువకుండా, జూనియర్లతో కార్యక్రమం ముగించినందున దానిని బహిష్కరించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో గంగాగౌడ్‌, శంకర్‌, గంగారెడ్డి, నాగ తారక్‌, తదితరులున్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article