Breaking News

Daily Archives: July 26, 2017

ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించం

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఈ కుట్రను సహించబోమని సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి అన్నారు. సివిల్‌ సప్లయ్‌ హమాలీలు చేస్తున్న నిరవధికసమ్మె బుధవారం రెండోరోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేషన్‌ డీలర్లు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, సిపిఐ నాయకులు నర్సింహారెడ్డిలు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహారభద్రత చట్టం 2013 ప్రకారం నిత్యవసర వస్తువులను రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేస్తుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ...

Read More »

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తాం

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని స్వయంసహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించేందుకు నాబార్డు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో బుధవారం అధికారులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సంఘాలు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడతాయన్నారు. ఆర్థికంగా, సామాజికంగా మహిళలు బలోపేతమయ్యేందుకు సంఘాలు ఉపయోగపడతాయన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరు ఓటరు ...

Read More »

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ పరిధిలోని అక్కన్నపేట స్టేషన్‌ వద్ద బుధవారం గుర్తు తెలియని యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు 35 సంవత్సరాల వయసు ఉంటుందని, చొక్కాపై బన్ని స్టైల్‌ ముస్తాబాద్‌ స్టిక్కర్‌ ఉందన్నారు. మృతుని ఎడమ చేతిపై అమ్మ పచ్చబొట్టు ఉందని హెడ్‌ కానిస్టేబుల్‌ పాండు నాయక్‌తెలిపారు. కేసు నమోదు చేసి, శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు వివరించారు.

Read More »

ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేయాలి

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో హరితహారంలో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం హరితహారంపై అదికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని డివిజన్‌ స్థాయిలో ప్రజల గుర్తింపు ఉండేవిధంగా రాశివనం కోసం స్థలం కేటాయింపు ప్రక్రియను ఆగష్టు మొదటివారం వరకు పూర్తిచేయాలని చెప్పారు. వ్యక్తుల పుట్టినరోజు సందర్భంగా చిరస్థాయి గుర్తింపు కోసం రాశిఫలాలను బట్టి మొక్కలు నాటే కార్యక్రమానికి ...

Read More »

ఆర్షగురుకులంలో హరితహారం

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోగల ఆర్షగురుకులంలో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, ఎంపిపి మంగమ్మ యాదవ్‌లతో కలిసి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, జనహితం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేశారు. పర్యావరణ హితం, జన హితంలో అందరూ భాగస్వాములు కావాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ...

Read More »