Breaking News

విద్యార్థులకు క్యారంబోర్డుల పంపిణీ

 

బీర్కూర్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో జిల్లా గంగపుత్ర సేవాసమితి సంఘం అధ్యక్షుడు గూండ్ల సాయిలు పాఠశాల విద్యార్థులకు గురువారం క్యారంబోర్డులు వితరణ చేశారు. చిన్నతనంలో తానుకూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని, విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఆటవస్తువులు, పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గాండ్ల రమేశ్‌, సర్పంచ్‌ అరిగె సాయిలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article