Breaking News

పోలీసులకు సహకరించాలి

 

బీర్కూర్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల వాసులు అనునిత్యం పోలీసులకు సహకరిస్తూ ఉండాలని సిఐ శ్రీనివాస్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని రాములగుట్ట తాండాలో సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ గోపి ఆద్వర్యంలో బుధవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన గ్రామసభలో సిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు, పోలీసులకు సహకరిస్తూ సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఎవరైనా హక్కులకు భంగం వాటిల్లినపుడు నేరుగా తమను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article