Breaking News

వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తాం

 

కామారెడ్డి, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం చెరువును ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు రవిందర్‌రెడ్డి, గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఓ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. అందులో భాగంగా వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును, కామారెడ్డి పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌లుగా మారుస్తున్నట్టు పోచారం పేర్కొన్నారు. అనంతరం వీటికి సంబంధించి చిత్రాలను వీక్షించారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article