Breaking News

Daily Archives: July 29, 2017

9వ వార్డులో హరితహారం

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో శనివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వార్డు కౌన్సిలర్‌ సంగి మోహన్‌లు వార్డులో మొక్కలునాటి నీరుపోశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో అందరు ప్రోత్సహించాలని సూచించారు.

Read More »

కామారెడ్డి జిల్లా సమగ్ర అబివృద్దిపై చర్చాగోష్టి

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దిపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. దీనికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ హాజరై మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి అద్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో వక్తలు మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని అమలు చేయాలని, కామారెడ్డిలో యూనివర్సిటీ నెలకొల్పాలని, సిరిసిల్లా నుంచి బీదర్‌కు రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. మేడ్చల్‌- ...

Read More »

జిల్లాకు మూడు స్మృతివనాలు మంజూరు

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు రెండు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలకు మొత్తం మూడు స్మృతివనాలు, రాశి వనాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. స్మృతివనాలు, రాశివనాల ఏర్పాటు గురించి శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వీటితోపాటు నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లా ప్రజలు తమ ఆత్మీయ స్మృతులను గుర్తుచేసుకునేవిధంగా వారి పేరుమీద స్మృతి వనంలో మొక్కలు నాటేందుకు అవకాశం ...

Read More »

ఖతార్‌ సంక్షోభానికి మోక్షం ఏదీ?

Qatar issue గల్ఫ్‌ మండలిలోని అతిచిన్న దేశమైన ఖతార్‌పై ఇతర అరబ్‌దేశాలు విధించిన ఆంక్షలతో ఇతర దేశీయులకు ముఖ్యంగా భారతీయులకు పాట్లు ఎక్కువయ్యాయి. అక్కడి వీసాలపై పనిచేసేందు కువచ్చినవారికి ఇతర గల్ఫ్‌దేశాల్లో పనులు ఉపాధి లభిం చడంలేదు. ఆర్ధికపరంగా ఆంక్షలు విధిస్తూ ఖతార్‌ను ఏ కాకినిచేసే విధంగా గల్ఫ్‌దేశాలు ఒక్కటయ్యాయి. విమా నాలు రద్దయ్యాయి. మరికొన్నింటికి రూట్లు మార్చివేసా రు. ఖతార్‌ పౌరులపై ఇతర గల్ఫ్‌దేశాల్లో బహిష్కరణ వేటు విధించారు.ఇదంతా ఎందుకు ఉగ్రవాదానికి ప్రత్యే కించి ఐసిస్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు ఖతార్‌ మద్దతు ...

Read More »

మోడ్రన్‌ డస్స్రులు ఇష్టం లేదు

తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదాతో హీరోయిన్‌ సాయిపల్లవి జనాలను బాగానే పడేసింది.. తెలంగాణలో అంటే ఆమె తెలంగాణ యాసకు పడిపోయారని అనుకోవచ్చు.. కానీ తెలుగు రాష్ట్రాలోని మిగతా ప్రాంతాల్లో కూడ ఈమె హావభావాలకూ బాగానే అభిమానులు ఏర్పడ్డారు.. కకపోతే అమ్మడు ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల దర్శకులకు ఒక షాకిచ్చింది. అసలు సాయి పల్లవికి గ్లామరస్‌ అనే పదమే నచ్చదట.. ఆమె కొనుకున్న డిక్షనరీలో ఆ పదం లేదని తేల్చేసింది.. కాకపోతే ఫిదా చిత్రంలో అమ్మడు అమెరికాలో జరిగే ఒక సీన్‌ ...

Read More »

మగాళ్లకు ఊరట వరకట్నం, గృహహింస కేసుల్లో.. నిజముంటేనే అరెస్టులు!

498-ఎ దుర్వినియోగం ఆపాలి ఆరోపణల్లో అసత్యాలే ఎక్కువ నిర్దోషుల హక్కులను కాపాడాలి కమిటీ నివేదిక ఇచ్చాకే చర్యలు బెయిల్‌పై వెంటనే నిర్ణయించాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు  ‘నన్ను కట్నం కోసం వేధిస్తున్నారు’ అని మహిళ ఫిర్యాదు చేయగానే ముందూ వెనుకా చూడకుండా భర్త, అత్త, మామ, ఆడబిడ్డలను అరెస్టు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులో ప్రస్తావించిన అంశాల్లో నిజాలను ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాతే అరెస్టు చేయాలని స్పష్టం చేసింది. దీనికోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గృహ హింస ...

Read More »

ట్యూషన్‌కు వచ్చిన అమ్మాయిపై ఉపాధ్యాయుడి అత్యాచారం

ఉత్తరకాశీ : అమ్మాయిలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది. ఉత్తరకాశీ జిల్లా మోరీ బ్లాకులో చీవా ఉన్నత పాఠశాలలో లలిత్ కుమార్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లలిత్ కుమార్ తన ఇంటి వద్ద పాఠశాల విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. రోజూ లాగే ట్యూషన్ కు వచ్చిన విద్యార్థుల్లో 14 బాలిక మినహా మిగతావారందరినీ ఇళ్లకు పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం ...

Read More »

ఎన్టీయార్‌ నిజంగానే ‘బిగ్‌బాస్‌’!

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ బుల్లితెర మీద ఆ స్థాయిలోనే విజయవంతమైంది. వెండితెర మీద వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఎన్టీయార్‌ బుల్లితెర మీద కూడా సత్తా చాటాడు. ‘బిగ్‌బాస్‌’ షోకు తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత హయ్యస్ట్‌ టీఆర్పీ రేటింగ్‌ను అందించాడు ఎన్టీయార్‌. ఈ దెబ్బకు గత వారానికిగానూ ‘బిగ్‌బాస్‌’ నెంబర్‌ వన్‌ రియాలిటీ షోగా, సదరు ఛానెల్‌ నెంబర్‌ వన్‌ ఎంటర్‌టైన్‌ ఛానల్‌గా నిలిచాయి. గత ఆదివారం ఎన్టీయార్‌ హోస్ట్‌ చేసిన ‘బిగ్‌బాస్‌’ షోకు ఏకంగా 16.8 టీఆర్పీ ...

Read More »

శునకం చూపించిన బాక్సు తెరవగానే….

ఏథెన్స్: శున‌కాలు నమ్మకానికి ప్రతిరూపాలు. య‌జ‌మానుల ఆస్తిపాస్తుల‌ను కాపాడ‌టంలో శున‌కాలు కీల‌క‌పాత్ర వ‌హించిన ఉదంతాలు వింటుంటాం. తాజాగా ఇటువంటి ఆస‌క్తిక‌ర‌ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రీక్‌లో అరాగాన్ అనే శున‌కం త‌న య‌జ‌మానితో పాటు మార్నింగ్‌వాక్‌కు వ‌చ్చింది. ఉన్నట్టుండి అది విచిత్రంగా ప్రవర్తించ‌డం ప్రారంభించింది. త‌న య‌జ‌మానిని లాగుతూ రోడ్డు ప‌క్కనున్న ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ ఒక బాక్పు ఉంది. దానిని తెరిచిన శున‌కం య‌జ‌మాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వివ‌రాల్లోకి వెళితే రోజూ మాదిరిగానే ఆరాగన్ త‌న య‌జ‌మానితో పాటు ఆరోజు మార్నింగ్‌వాక్‌కు వెళ్లింది. కొద్ది దూరం ...

Read More »

కొవ్వును తగ్గించే రెసిపీలు

 పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. పెరిగిపోయిన ఫ్యాట్‌ వల్ల జీవక్రియ సరిగా జరగదు.  అందుకే నిత్యం డైట్‌, వ్యాయామాలు చేయడంతోపాటు వంటింట్లో లభించే కొన్ని ఆహారపదార్థాలను రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేస్తే పొట్ట చుట్టూ, నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. నిమ్మరసం: పొద్దున్నే లేచిన వెంటనే పళ్లు తోముకుని గ్లాసుడు నిమ్మరసం తాగాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో నిమ్మరసం ఉత్తమం. కాలేయంలోని విషపదార్థాలను తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది. అందుకే ...

Read More »

దుబాయి రాజు సంచలన నిర్ణయం.. వెబ్‌సైట్ బ్యాన్..!

యూఏఈ: ఖతార్‌పై సౌదీ సహా ముస్లిం దేశాలు కత్తిగట్టిన తర్వాత.. ఆయా దేశాల మధ్య సంబంధాలు మరింతగా చెడిపోతున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు ముస్లిం దేశాలు.. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న కారణంతో ఖతార్‌పై నిషేధం విధించాయి. అంతే కాకుండా పాలు సరఫరా చేయకపోవడం వంటి పలు ఆంక్షలను కూడా మొదట్లో పెట్టాయి. అయితే ఆయా దేశాల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉండటంతో.. సమస్యను మరింత జఠిలం చేసే కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఖతార్‌కు చెందిన ‘అల్ జజీరా’(Al-Jazeera) ...

Read More »