Breaking News

దుబాయి రాజు సంచలన నిర్ణయం.. వెబ్‌సైట్ బ్యాన్..!

యూఏఈ: ఖతార్‌పై సౌదీ సహా ముస్లిం దేశాలు కత్తిగట్టిన తర్వాత.. ఆయా దేశాల మధ్య సంబంధాలు మరింతగా చెడిపోతున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు ముస్లిం దేశాలు.. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న కారణంతో ఖతార్‌పై నిషేధం విధించాయి. అంతే కాకుండా పాలు సరఫరా చేయకపోవడం వంటి పలు ఆంక్షలను కూడా మొదట్లో పెట్టాయి. అయితే ఆయా దేశాల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉండటంతో.. సమస్యను మరింత జఠిలం చేసే కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఖతార్‌కు చెందిన ‘అల్ జజీరా’(Al-Jazeera) అనే బిజినెస్ వెబ్‌సైట్లో ఇటీవల ఓ వార్త దుబాయిలో కలకలం రేపింది. దుబాయిలోని దాదాపు 51 కంపెనీలు తమ కార్యకలాపాలను యూఏఈ దేశంలో నిలిపివేయనున్నాయనీ, దీని వల్ల పారిశ్రామికంగా వేల కోట్ల నష్టం వాటిల్లనుందని పేర్కొంటూ ఓ వార్తను ప్రచురించింది. అయితే ఇదేదీ నిజం కాకపోగా.. దాదాపు ఏడేళ్ల క్రితం అంటే 2010లో జరిగిన పరిణామాలను ఉదహరిస్తూ రాసిన కథనాన్ని ప్రచురించింది. పూర్తి అవాస్తవాలతో వార్తలను ప్రచురించి దుబాయి ప్రతిష్టకు భంగం వాటిల్లజేయడమే కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు, ప్రభుత్వ అవినీతి కారణంగానే కంపెనీలు తరలిపోతున్నాయని కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై దుబాయి ప్రభుత్వం సీరియస్ అయింది. వెబ్‌సైట్ నిర్వాహకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా ఖతార్ వెబ్‌సైట్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. దాదాపు నెల రోజుల పాటు ఆ వెబ్‌సైట్‌పై తమ దేశంలో నిషేధం విధిస్తూ దుబాయి రాజు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఓ విదేశీ వెబ్‌సైట్‌ను బ్యాన్ చేయడం దుబాయిలో ఇదే మొదటిసారని చెబుతున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article