Breaking News

ఖతార్‌ సంక్షోభానికి మోక్షం ఏదీ?

Qatar issue
Qatar issue

గల్ఫ్‌ మండలిలోని అతిచిన్న దేశమైన ఖతార్‌పై ఇతర అరబ్‌దేశాలు విధించిన ఆంక్షలతో ఇతర దేశీయులకు ముఖ్యంగా భారతీయులకు పాట్లు ఎక్కువయ్యాయి. అక్కడి వీసాలపై పనిచేసేందు కువచ్చినవారికి ఇతర గల్ఫ్‌దేశాల్లో పనులు ఉపాధి లభిం చడంలేదు. ఆర్ధికపరంగా ఆంక్షలు విధిస్తూ ఖతార్‌ను ఏ కాకినిచేసే విధంగా గల్ఫ్‌దేశాలు ఒక్కటయ్యాయి. విమా నాలు రద్దయ్యాయి. మరికొన్నింటికి రూట్లు మార్చివేసా రు.

ఖతార్‌ పౌరులపై ఇతర గల్ఫ్‌దేశాల్లో బహిష్కరణ వేటు విధించారు.ఇదంతా ఎందుకు ఉగ్రవాదానికి ప్రత్యే కించి ఐసిస్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు ఖతార్‌ మద్దతు ప్రకటిస్తోందని, ఉగ్రవాద ప్రేరేపిత ప్రసారాలు చేస్తున్న దంటూ ఆల్‌జజీరాఛానల్‌ను వెంటనే నిలిపివేయా లన్న ఆంక్షలు విధించింది. ఈఆంక్షలు,అడ్డంకులు ఖతార్‌లోని అతిపెద్ద ఏవియేషన్‌ రంగానికి విఘాతం కలిగించిందనే చెప్పాలి. దేశంలో90శాతం మంది ప్రజలు ఇతర దేశాల నుంచివచ్చి ఉపాధి పొందుతున్నవారే. ఖతార్‌లోని ఖఫాలా కార్మిక ప్రాయోజిత వ్యవస్థ అమలులో ఉండటంతో ఖతార్‌కు వలస ఉద్యోగులు ఎక్కువ వస్తుంటారు. ఈ వ్యవస్థలో వలస కార్మికులు ఎక్కువగా వారివారి యజమానులపైనే ఆధారపడి వీ సాలు, వసతి, దేశంలో ప్రవేశించడం,నిష్క్రమించేందుకు వారి అనుమతులే అనివార్యం అవుతాయి.

ఈ కఫాలా వ్యవస్థపట్ల విభిన్న వర్గాలనుంచి విమర్శలు ఎదురయినా ఆదేశం ఈ వ్యవస్థనే విశ్వసిస్తోంది. ఈ వ్యవస్థపైనే ఖతార్‌ అంతర్జాతీయ కార్మికసంస్థ దర్యాప్తును సైతం ఎదుర్కొన్నది. వెట్టిచాకిరీ వ్యవస్థ అమలవుతున్నందున దీనిపై అంతర్జాతీయ సంస్థ కన్నెర్రచేసింది. 2022లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రపంచకప్‌ దో హాలో జరుగనుండటంతో ఇప్పటినుంచే నిర్మాణపనులు జరుగుతున్నాయి.ప్రస్తుత ఆంక్షలప్రభావం నిర్మాణ పను లపై భారీగా చూపుతోంది.పాస్‌పోర్టులను అనుమతించక పోవడం, వేతనాలు ఇవ్వకపోవడం,అరకొర వసతి ఏర్పా ట్లు, నియామక సంస్థలనుంచి అత్యధికఫీజులు వసూలు చేయడం వంటి వాటితో ఉద్యోగులు, కార్మికులు అల్లాడు తున్నారు. ఇదంతా ఎందుకువచ్చింది. ఖతార్‌ ఉగ్రవాదా నికి ప్రోత్సాహం ఇస్తున్నదన్న ఇతర దేశాల అభియోగా లేనని చెప్పకతప్పదు. తన విధానాలను మార్చుకునే అవకాశం ఉంటుందా?లేక తనదైనశైలిలో అలాగే కొనసా గుతుందా? అంటే ఇప్పటికీ అదేవిధానంలో పోతున్నది. ఇతర గల్ఫ్‌దేశాలు చేస్తున్న అభియోగాలన్నీ అవాస్తవ మని చెపుతున్నది. ఇతర దేశాలయితే ఖతార్‌లో కొన్ని ఉగ్రవాదసంస్థలు కార్యాలయాలే ఏర్పాటుచేసాయని అభి యోగాలు మోపుతున్నాయి.

వీటన్నింటి దృష్ట్యా ప్రస్తు తం ఖతార్‌లో పనిచేస్తున్న వలస కార్మికులస్థితి మరింత దయనీయంగా మారిందనే చెప్పాలి సౌదీలో పనిచేస్తున్న ఖతార్‌పౌరులకు సరైన వసతి, జీతాలు కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఖతార్‌కు వచ్చేందుకు ఉన్న ఏకైక రోడ్డుమార్గాన్ని మూసివేసిందని ఆదేశం ఆరోపిస్తున్నది. దక్షిణాసియా దేశాలనుంచి వస్తున్న ఉద్యోగులే అక్కడ నరకం చవిచూస్తున్నారు.వారికి జీతాల్లేవు.వారిని స్పాన్స ర్‌చేసిన నియామక సంస్థలు పత్తాలేవు. వీటితో ఎటూ తోచక ఇక మరణమే శరణ్యమన్న రీతిలో ఉన్న అక్కడి వలస ఉద్యోగుల ఆక్రందనలు ఎవ్వరికీ వినిపించడం లేదు.

గల్ఫ్‌దేశాల్లో భారత్‌నుంచి అందులోనూ రెండు తెలు గురాష్ట్రాలనుంచి వెళ్లినవారే ఎక్కువ.వీరిలో కొంద రికి ఉద్యోగాలిస్తామని అక్కడికి పంపించిన తర్వాత ఫామ్‌హౌస్‌ల్లోను, వాచ్‌మెన్‌లు గాను వినియోగించుకుం టూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటం నిత్య కృత్యమైంది.అంతర్జాతీయ సమాజం తక్షణజోక్యం అని వార్యంఅని ప్రస్తుత ఖతార్‌పరిస్థితులు స్పష్టం చేస్తున్నా యి. ఎక్కువ మంది గల్ఫ్‌దేశాల్లోనే స్తంభించిపోయారు అక్కడి యాజమాన్యాలు పనులను నిలిపివేయడంతో ఉద్యోగులవెతలు మరింత తీవ్రతరం అయ్యాయి.

గల్ఫ్‌ సహకార మండలి జోక్యంచేసుకుని సంప్రదింపులు జరు పుతున్నదా? లేక ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఖతార్‌ సమస్యపై స్పందించి ప్రస్తుత వాతావ రణాన్ని సర్దుబాటుచేసే అవకాశం ఉందాఅంటే సమీప భవిష్యత్తులో కనిపించడంలేదు. ఖతార్‌లోని ప్రస్తుత కఫాలా వ్యవస్థను రీబ్రాండ్‌ చేయడం వల్ల దేశంలోనికి ప్రవేశించాలన్నా,వెళ్లిపోవాలన్నాఅనుమతులు యాజమా న్యాల అధీనంలోనే ఉంటాయి. ఈ వ్యవస్థతో కార్మికులు తరచూ దాడులకు లోనవుతున్నారు. వీటికితోడు ఖతార్‌ లో ప్రస్తుతం స్టేడియం నిర్మాణపనులకు ఇతర దేశాల నుంచి రావలసిన ముడివనరులు అందడంలో కూడా జాప్యంవల్ల నిర్మాణపనులు స్తంభించాయి.

చమురుసంప న్న దేశంగా భాసిల్లుతున్న ఖతార్‌ ఇతర దేశాల హెచ్చరి కలు,ఆంక్షలను లక్ష్యపెట్టకపోయినాప్రపంచ ఫుట్‌బాల్‌కప్‌ పోటీలకు అవసరమైన మౌలికవనరులు సమకూర్చుకోవ డం అక్కడి పాలకుల ప్రధాన బాధ్యత. ఇప్పటికే గత ఏడాదిచమురుధరల పతనంవల్ల సుమారు77వేలమంది వలసకార్మికులకు ఉపాధి కరువైంది.మూడులక్షల మంది కార్మికులు ఇప్పటికే ఖతార్‌లోని దోహా ప్రాంతం వదిలి వెళ్లిపోయారు. ఇదేపరిస్థితి మరింతగా కొనసాగితే చిన్న కంపెనీలు వారిఉద్యోగులను దీర్ఘకాలిక శెలవులపై పంప వచ్చు, లేదా వారి వీసాలను రద్దుచేసే ప్రమాదంఉంది. ప్రపంచ మానవహక్కుల సంస్థలు, అమ్నెస్టీ ఇంటర్నే షనల్‌ వంటి సంస్థలు జోక్యంచేసుకుంటే తప్ప ఒక్క ఖతార్‌లోనే కాదు గల్ఫ్‌దేశాల్లో ఎదుర్కొంటున్న ఈ సమ స్యలకు మోక్షం కలుగదని నిష్కర్షగా చెప్పవచ్చు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article