Breaking News

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

 

కామారెడ్డి, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం టిజివిపి 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిజివిపి ప్రధానపాత్ర పోషించిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నట్టు తెలిపారు. ఆగష్టు 2 వరకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌, ప్రతినిధులు రాజు, ఓంకార్‌, పృథ్వీ, నరేశ్‌, నిఖిల్‌, దిలీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article