Breaking News

నల్లబ్యాడ్జీలతో కాంగ్రెస్‌ నాయకుల నిరసన

 

కామారెడ్డి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే అది సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమేనన్నారు. కెసిఆర్‌ కాంగ్రెస్‌ను విమర్శించడమంటే కన్నతల్లిని దూషించినట్టేనని,ఆయనకు పుట్టగతులుండవని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ద్వారా కేవలం కెసిఆర్‌కుటుంబమే లబ్దిపొందుతుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్దిచెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కన్నయ్య, గోనె శ్రీనివాస్‌, ప్రసాద్‌, చింతల శ్రీనివాస్‌, కిషన్‌రావు, భూపాల్‌రెడ్డి, రాజు, విష్ణు, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article