Breaking News

ఆర్టీసి డిపో ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

 

కామారెడ్డి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట గురువారం ఏఐఎస్‌ఎఫ్‌, టిజివిపి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమకొండ, పెద్ద మల్లారెడ్డి, సింగరాయపల్లి రూట్లలో నడుపుతున్న బస్సు సమయాల్లో మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల కళాశాలలు సమయానుకూలంగా బస్సులు నడపాలని గతంలో పలుమార్లు కోరినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సమయంలో మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు చెలిమెల భానుప్రసాద్‌, ప్రకాశ్‌, భవిత్‌, బరత్‌, భాస్కర్‌, ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article