Breaking News

Daily Archives: August 4, 2017

అధికార లాంఛనాలతో విఠల్‌రెడ్డి అంత్యక్రియలు

  కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తొలి శాసనసభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్‌రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించారు. అంత్యక్రియలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డిలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రముఖులందరు విఠల్‌రెడ్డికి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.

Read More »

నోటుపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ పూర్తిచేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ప్రబుత్వం అందిస్తున్న నోటుపుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రి పంపిణీ వందశాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ విద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం విద్యాధికారులతో సమీక్షించారు. పాఠశాలల్లో మద్యాహ్న భోజనం ఆన్‌లైన్‌ నమోదు 78 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని సూచించారు. దూరం నుంచి వచ్చే 873 మంది విద్యార్థులకు రవాణా ఖర్చు కింద నెలకు రూ. 300 ...

Read More »

వ్యాక్సినేషన్‌ గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిజిల్స్‌, రొబెల్లా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించిన 9 రకాల గోడప్రతులను శుక్రవారం కామారెడ్డి జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ ఆవిష్కరించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో రొబెల్లా వ్యాక్సినేషన్‌ జిల్లా టాస్క్‌పోర్సు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు సంబందించి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో పోస్టర్లు రూపొందించామని తెలిపారు. వ్యాక్సినేషన్ల పూర్తి సమాచారం పోస్టర్‌లో ఉంటుందన్నారు. 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరికి టీకా తప్పకుండా ఇప్పించాలని సూచించారు. జిల్లాలో వందశాతం టీకాలను వేయించాలని ...

Read More »

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

  కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండల కేంద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన లింగం రామారెడ్డి పోలీసు స్టేషన్లో విదులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా బైక్‌పై వెళుతున్న సమయంలో కారు ఢీకొంది. కారు పల్టీలు కొడుతూ పక్కకు పడిపోయింది. అందులో ప్రయానీకులకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ లింగం సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. దీంతో పోలీసు అధికారులు, ఆర్టీఓ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ...

Read More »

బస్సుల సమయపాలనపై విద్యార్థుల ఆందోళన

  కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న సమయపాలన పాటించడంలేదని, విద్యార్థులకు సహకరించడం లేదని పేర్కొంటూ శుక్రవారం ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు దర్నా నిర్వహించారు. డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్‌ డిపో బస్సులు కామారెడ్డి వైపు ఉదయం వేళ సరైనసమయానికి రావడం లేదని, వచ్చినా ఆయా స్టేజీల వద్ద సరిగా ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్‌, ...

Read More »

ఘనంగా వరలక్ష్మి వ్రతం

  కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. వరలక్ష్మి దేవిని పువ్వులు, పండ్లు, నైవేద్యాలతో కొలుస్తారు. కుటుంబం చల్లగా ఉండాలని వ్రతం చేస్తారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ముత్తైదువతనాన్ని కాంక్షిస్తూ వత్రం ఆచరిస్తారు. ఆలయాలుసైతం భక్తులతో కిటకిటలాడాయి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

సింగూరు నీటిని వదిలి పంటలు కాపాడాలి

  బోధన్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అయిన సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టిఎంసిల నీటిని విడుదల చేయాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని బోధన్‌ ఎంపిపి అద్యక్షుడు గంగాశంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి అల్లె రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో పట్టణంలోని అనీల్‌ టాకీస్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వేసుకున్న పంటలకు నీరు లేక వ్యవసాయసాగు ...

Read More »

ప్రభుత్వ కళాశాలకు బస్సు నడపాలని వినతి

  ఆర్మూర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ పిడిఎస్‌యు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్‌ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా అధ్యక్షుడు నరేందర్‌ మట్లాడుతూ పట్టణంలో పిప్రిరోడ్డులో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు ఉన్నాయని, అక్కడికి గత 15 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం ఉందన్నారు. కానీ గత మార్చి నెలవరకు బస్సు వచ్చింది ఈయేడు మాత్రం బస్సు సౌకర్యం లేదన్నారు. ఈ ...

Read More »

నీటి పన్ను వసూలు ముమ్మరం

  నిజాంసాగర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు నీటి పన్నులను ముమ్మరంగా వసూలు చేస్తున్నారని తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌ తెలిపారు. శుక్రవారం కార్యదర్శి పండరి నీటి పన్ను వసూలు చేస్తుండగా తహసీల్దార్‌ గ్రామాన్ని సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించి, మండలంలో ప్రస్తుతం ప్రతి గ్రామంలో నీటి పన్ను వసూలు ముమ్మరం చేస్తున్నారని, మరో 40 శాతం వసూలు చేయాల్సి ఉందన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌ ఉన్నారు.

Read More »

హసన్‌పల్లిలో సంచరిస్తున్న చిరుతపులి

  నిజాంసాగర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో గల హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించడంతో పశువుల కాపరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు మేకలు, గొర్రెల కాపరులు పశువులను అటవీప్రాంత పరిసరాల్లో మేసేందుకు తీసుకెళుతుంటారు. దీంతో చిరుతపులి పశువులపై దాడిచేసి గాయపరుస్తుందని పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే హసన్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు మేకల మందలపై దాడిచేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ...

Read More »

మోర్తాడ్‌ ఎండలమ్మ కుంటలో చేపలు మృతి

  – 8 లక్షల ఆస్తి నష్టం మోర్తాడ్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ శివారులోగల ఎండలమ్మ కుంటలో పెంపకం చేసిన చేపలు మృతి చెందాయని మోర్తాడ్‌ గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. శనివారం గంగపుత్రులు చేపలు పట్టడానికి వెళ్లగా చేపలు మృతి చెంది నీటిపై తేలడాన్ని చూసి అవాక్కయ్యారు. మృతి చెందిన చేపల్ని బయటకు తీసి మరిన్ని మృతి చెందకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని మోర్తాడ్‌ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌కు వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. తహసీల్దార్‌ ...

Read More »

ఆరేపల్లి సర్పంచ్‌కు ప్రశంసాపత్రం

  నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో ఆరేపల్లి గ్రామ సర్పంచ్‌ స్వప్న రవిందర్‌గౌడ్‌కు ఎంపిపి సునంద గంగారెడ్డి, ఎంపిడివో రాములు నాయక్‌ ప్రశంసా పత్రం అందజేశారు. ఆరేపల్లి గ్రామపంచాయతీలో 40 వేల మొక్కలు హరితహారం పథకం కింద నాటడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పంపించిన ప్రశంసా పత్రాన్ని సర్పంచ్‌కు అందజేశారు. గ్రామంలో నిర్దిష్ట గడువులో మొక్కలు నాటేందుకు అధికారులకు సహకరించినందుకు ఎంపిడివో, సర్పంచ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌, ...

Read More »

బ్యాంకు ద్వారానే ఉపాధి డబ్బులు

  నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు పోస్టాఫీసు ద్వారా డబ్బులు ఇవ్వకుండా నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమచేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ అన్నారు. హసన్‌పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల నుంచి బ్యాంకు ఖాతాలను, ఆధార్‌ నెంబరు సేకరించారు. ఈ సందర్బంగా ఎపిఎం మాట్లాడుతూ ఉపాది హామీ కూలీలకు పోస్టాఫీసులో డబ్బు జమకావని, బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమఅవుతుందన్నారు. జాబ్‌కార్డు కలిగిన కూలీలందరు ...

Read More »

చురుకుగా హరితహారం

  మోర్తాడ్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం పథకంలో భాగంగా మోర్తాడ్‌లో శనివారం ఎస్సీ, బిసి కాలనీలోగల గ్రామపంచాయతీ భూముల్లో స్థానిక సర్పంచ్‌ దడివెనవీన్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంపిడివో శ్రీనివాస్‌ మొక్కలునాటి నీరుపోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోవిడత హరితహారంలో మోర్తాడ్‌లో మొక్కలునాటి లక్ష్యాన్ని చేరుకోనున్నారని ప్రశంసించారు. శనివారం వందమంది ఉపాధి కూలీలతో 400 గుంతలు తవ్వించి మామిడి, జామ, టేకు మొక్కలు నాటింపజేసినట్టు తెలిపారు. మొక్కల పెంపకం వల్ల పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, స్వచ్చమైన ...

Read More »

హరితహారం పథకంలో మొక్కల సంరక్షణ

  నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గ్రామ గేటువద్ద నాందేడ్‌, సంగారెడ్డి, అకోల 161 జాతీయరహదారి సమీపంలోగల అభయాంజనేయస్వామి ఆవరణలో హరితహారం పథకం కింద నాటిన మొక్కలకు నీరుపోసి సంరక్షించే బాధ్యతను గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కిషోర్‌కుమార్‌ తీసుకున్నారు. ఆలయంలో ఇటీవలే మూడోవిడత హరితహారం పథకంలో భాగంగా జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మొక్కలు నాటారు. ఆలయ ఆవరణలో 200 మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రతిరోజు ...

Read More »