Breaking News

Daily Archives: August 8, 2017

పిట్లం మండలంలో ఘనంగా రక్షాబంధన్‌

  పిట్లం, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజలు రక్షాబంధన్‌ ఘనంగా నిర్వహించారు. మండలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ, ఆర్యసమాజ్‌, ఏబివిపి సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుతో ఆడపడ్చు రాఖీ కట్టి వారి ఆశీస్సులు పొంది సోదరుడికి సోదరి రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు. మండలంలో ప్రతి ఇంటా రాఖీ పౌర్ణమి ఘనంగా మిఠాయిలు తినిపిస్తు నిర్వహించారు.

Read More »

అగస్త్య ఫౌండేషన్‌ ల్యాబుల నిర్వహణ అభినందనీయం

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగస్త్య పౌండేసన్‌ ఆధ్వర్యంలో సైన్స్‌ ల్యాబులు నిర్వహించడం అభినందనీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లాలో అగస్త్య ఫౌండేషన్‌ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించేందుకు సోమవారం ఫౌండేషన్‌ ప్రతినిదులు కలెక్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో నిర్వహిస్తున్న ఒక సైన్స్‌ల్యాబు, మరో రెండు మోబైల్‌ సైన్స్‌ ల్యాబులు కామారెడ్డి, బాన్సువాడలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటి వల్ల పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైన్స్‌ రంగం పట్ల ఆసక్తి ...

Read More »

గుట్కా సరఫరా చేస్తున్నవారి అరెస్టు

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా గుట్కా సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్టు కామారెడ్డి ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. సంతోస్‌, కిరణ్‌ అనే వ్యక్తులు గుట్కా సరఫరా చేస్తుండగా వారి వద్దనుంచి మూడు గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ నాగరాజుకు సరెండర్‌ చేసినట్టు తెలిపారు.

Read More »

బీడీ పరిశ్రమపై జిఎస్‌టి ఎత్తివేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమపై జిఎస్‌టిని వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు డిమాండ్‌ చేశారు. ఆయన అధ్యక్షతన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ పరిశ్రమపై జిఎస్‌టి ప్రభావం అనే అంశంపై బీడీ కార్మిక జేఏసి ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిఎస్‌టి ప్రభావంవల్ల బీడీ పరిశ్రమపై భారం పడుతుందన్నారు. ఆగష్టు 17న కామరెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ కార్మికుల ...

Read More »

విద్యుత్‌ ఘాతంతో మహిళ మృతి

  నందిపేట, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన మహిళ పొలంలో విద్యుత్‌ తీగకు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి వివరాల ప్రకారం… మారంపల్లి గ్రామానికి చెందిన గాజం గంగు (67) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన పొలంలో కలుపుతీయడానికి వెళ్లింది. అయితే తన పొలానికి ఆనుకొని ఉన్న పక్కపొలం యజమాని బంగారు చిన్నసాయిరెడ్డి పందులు ధ్వంసం చేయవద్దనే ఉద్దేశంతో విద్యుత్‌ తీగలు బిగించాడు. అది ...

Read More »

మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించిన బాలమణి

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం కోమలంచ గ్రామానికి చెందిన బాలమణి తనను, తన కొడుకును ఎస్‌ఐ దాడిచేసి గాయపరిచిన సంఘటనపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించింది. నిజాంసాగర్‌ ఎస్‌ఐ అంజిరెడ్డి తన కొడుకు దొంగతనం చేశాడనే నెపంతో అర్థరాత్రి ఇంట్లోకి వచ్చి ఇష్టానుసారంగా కొట్టాడన్నారు. తన కొడుకును, తనను అన్యాయంగా కొట్టిన విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించలేదని పేర్కొన్నారు. ఎస్‌ఐపై చర్యల కోసం ఆమె భర్త మల్లయ్య, ...

Read More »

సమ్మె నోటీసును ఆర్డీవోకు అందజేసిన కార్మికులు

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మునిసిపల్‌ కార్మిక సంఘాల జేఏసి ఆదేశాల మేరకు ఆగష్టు 29, 30 తేదీల్లో వివిధ విభాగాలకు చెందిన మునిసిపల్‌ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్టు, వాటికి సంబంధించిన నోటీసులను మంగళవారం కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్‌కు మునిసిపల్‌ కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి లాగానే వివిధ జిల్లాల్లో కార్పొరేషన్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని ఏళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. సుప్రీంకోర్టు ...

Read More »

యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి

బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కాంగ్రెస్‌ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు.

Read More »

పోలీసుల చేతికి ఎటిఎం దొంగ

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎటిఎంల వద్దకెళ్లిన వ్యక్తుల నుంచి వారి కార్డును తస్కరించి అనంతరం వినియోగించి డబ్బు దోచుకుంటున్న ఎటిఎం దొంగను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌ నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. రైల్వేస్టేషన్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తిని పట్టుకొని విచారించగా ఎటిఎంల చోరీ విషయం బయటపడిందన్నారు. నిజామాబాద్‌ పద్మనగర్‌ రోడ్డునెంబరు 2కు చెందిన మంచికట్ల విజయ్‌కుమార్‌ (30) ...

Read More »

ఈతవనాల పెంపకంతో గౌడకులస్తుల అభివృద్ది

  బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈతవనాలు నాటి పెంచడంతో గౌడ కులస్తులు అభివృద్ది చెందుతారని మీర్జాపూర్‌ గౌండ్ల సంఘం అధ్యక్షుడు గంగరాజుగౌడ్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో మంగళవారం ఈతవనాల మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడకులస్తులు అందరు ఏకం కావాలని పేర్కొన్నారు. గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Read More »

గురుకుల సమస్యలపై ఆర్డీవోకు వినతి

  ఆర్మూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు సమస్యలతో సతమతమవుతున్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షుడు నరేందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు గురుకులాల్లో సర్వేలు నిర్వహించడం జరిగిందని, ఇందులో గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో ...

Read More »

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

  పిట్లం, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళల కృషి చేస్తానని కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన అధ్యక్షుడు లచ్చిరాం అన్నారు. ఆయనకు మంగళవారం పిట్లం మండలం రాంపూర్‌ కలాన్‌ ప్రాథమిక పాఠశాలలో జిల్లాపరిషత్‌, ప్రాథమిక పాఠశాల, మండల కార్యవర్గ సభ్యులు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్‌ విధానం రద్దుచేసి జిపిఎఫ్‌ విధానం అమలు, మెమో నెంబరు 26559 ను రద్దుచేసి ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

  నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లయన్స్‌ క్లబ్‌ పిట్లం శాఖవారు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో కంటి వైద్య నిపుణులు మల్లేశం 40 మంది వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 14 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక వాహనంలో బోధన్‌ కంటి వైద్యశాలకు తరలించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు సంతోష్‌, జోన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌, గంగాప్రవీణ్‌, శ్రీధర్‌, తదితరులున్నారు.

Read More »

జాతీయస్థాయి అండర్‌-12 సాప్ట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా మమత

  ఆర్మూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాప్ట్‌బాల్‌ అండర్‌-12 జూలై 8,9,10 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన టోర్నమెంట్‌లో మంచి ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ శోభన్‌బాబు కెప్టెన్‌గా మమతను నియమించారు. జాతీయస్థాయి జట్టు కెప్టెన్‌గా నియమించినందున మానస స్కూల్‌ కరస్పాండెంట్‌ మానస గణేష్‌, పాఠశాల పరిపాలన అధికారి మానస పద్మ తెలిపారు. జిల్లా సాప్ట్‌బాల్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సాప్ట్‌బాల్‌ సెక్రెటరీ గంగామోహన్‌, పిఇటి వినోద్‌ మమతను అభినందించారు. ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు ...

Read More »