Breaking News

Daily Archives: August 9, 2017

ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

  కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 57వ యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలోబుధవారం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోయల్‌కర్‌ కన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రస్తుత తెరాస ప్రబుత్వ హయాంలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడిలతో, ఆవేదనతో ఉందన్నారు. అటు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో ...

Read More »

పౌష్టికాహారంపై కరపత్రాల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల పౌష్టికాహారానికి సంబందించి తల్లులు అందించాల్సిన ఆహారంపై రూపొందించిన కార్డులను బుధవారం జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐసిడిఎస్‌ పిడి రాధమ్మ, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ, సిడిపివో సంధ్యారాణి, సూపర్‌వైజర్‌ స్వర్ణలతలు కార్డులను పిల్లల తల్లులకు పంపిణీ చేశారు. కార్డు గురించి వారికి వివరించారు. అంగన్‌వాడికి వచ్చే పిల్లలకు వారి శారీరక, ఆలోచన, జ్ఞాపకశక్తిని బట్టి వివరాలు కార్డుల్లో పొందుపరిచి తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. మూడునెలలకోసారి విద్యార్థుల అభ్యాసక ...

Read More »

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ జీవన ఇంధన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజ్ఞానభారతి డిగ్రీ కళాశాలలో ఎన్‌వైసిఎస్‌ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు డ్రాయింగ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జీవ ఇంధనం సంబంధించిన కార్యక్రమాల కార్యాచరణ గురించి వివరించారు. గురువారం ఇదే అంశంపై పాఠశాల, కళాశాలల విద్యార్థులతో స్థానిక శిశుమందిర్‌ పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 11న ప్రజ్ఞా డిగ్రీ కళాశాలలో సెమినార్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌వైసిఎస్‌ జిల్లా ప్రతినిధి బాపురెడ్డి, ...

Read More »

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

  కామరెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేశారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మీడియా సమక్షంలో కార్మిక సంఘాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని రంగాల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కనీస వేతనం రూ. 18 ...

Read More »

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలు

  నందిపేట, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులోగల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వినీత్‌ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ దేశంలో యువజన కాంగ్రెస్‌ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తయిందన్నారు. యువజన కాంగ్రెస్‌ వల్ల యువకులు రాజకీయాలవైపు ఆకర్షితులై నాయకులుగా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల వరకు ఎదిగారన్నారు. జిల్లావాసి తాహెర్‌బిన్‌ హందాన్‌ యువజన కాంగ్రెస్‌లో ...

Read More »

వృద్దాశ్రమంలో పండ్ల పంపిణీ

  కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సినీ నటుడు మహేశ్‌బాబు జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం మహేశ్‌బాబు అభిమానులు కామారెడ్డి శివారులోని శారదాదేవి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్దుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు శారదాదేవి, మహేశ్‌బాబు అభిమానులు సాయికిరణ్‌, రహీమ్‌, ఆనంద్‌, రాజు, నర్సింలు, వినోద్‌, సతీస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ సభకు తరలిరండి

  నందిపేట, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునర్జీవ పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురువారం విచ్చేస్తున్న సందర్భంగా ఆర్మూర్‌ నియోజకవర్గ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కోరారు. బుధవారం నందిపేట మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం 2 వేల కోట్లతో పునర్జీవ పథకాన్ని ...

Read More »

సింగూరు జలాలను నిజాంసాగర్‌కు మళ్ళించండి

  – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బోధన్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందస్తు కురిసిన వర్షాల వల్ల నిజామాబాద్‌ జిల్లాలో రైతులు ఎక్కువశాతం వరినాట్లు వేశారుకానీ వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగం పంటలను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు షేక్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా రైతాంగానికి గుండెకాయలాంటి నిజాంసాగర్‌ను నమ్ముకున్న రైతులు నిజాంసాగర్‌ ద్వారా వచ్చే నీటి కొరకు ఎదురుచూస్తున్నారని, నిజాంసాగర్‌ ఆయకట్టు వరిపొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ...

Read More »

తెవివికి వందకోట్ల నిదులు ప్రకటించాలి

  – పిడిఎస్‌యు డిచ్‌పల్లి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, తెవివికి వందకోట్ల నిధులు కేటాయించాలని పిడిఎస్‌యు తెవివి కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెవివి పిడిఎస్‌యు అధ్యక్షుడు అన్వేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల కోసమే రావాలని, తెలంగాణ వస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని కెసిఆర్‌ ప్రతి సబలో అన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక విద్యార్థులకు మొండి చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పేరుతో ...

Read More »

నట్టణ నివారణపై విద్యార్థుల ర్యాలీ

  పిట్లం, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో బుధవారం ఆరోగ్యశాఖ సిబ్బంది నట్టల నివారణ మందులపై పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్లం ఆరోగ్యశాఖ వైద్యాధికారి నాగయ్య మాట్లాడుతూ చిన్నారులు వారి ఆరోగ్యం మెరుగు పడేందుకు నట్టల నివారణ మందులు తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సూపర్‌వైజర్‌ మాణిక్యమ్మ, జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాద్యాయులు ఫన్నాలాల్‌, ఉపాద్యాయులు గణేష్‌రావు, ఎఎన్‌ఎం, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Read More »

సిఎం సభ విజయవంతం చేయండి

  పిట్లం, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునర్జీవ పథకం శంకుస్థాపనకు రానున్నారని మండల తెరాస నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆయన బుధవారం పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ ఉంటుందని ...

Read More »

పిట్లంలో ఘనంగా యూత్‌కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

  పిట్లం, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇందిరాగాంధి విగ్రహం వద్ద మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిఖిల్‌గౌడ్‌ జెండా ఆవిష్కరణ చేసి, జాతీయ రహదారి వరకు కాంగ్రెస్‌ పార్టీ నినాదాలు చేస్తు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం యువకులు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నిఖిల్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇందిరాగాంధీ 1960లో యువజన కాంగ్రెస్‌ను ...

Read More »

డెంగ్యూ వ్యాధితో మృతి చెందలేదు

  నిజాంసాగర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ సలీం అనే వ్యక్తి డెంగ్యూ వ్యాధితోమృతిచెందలేదని మండల వైద్యాధికారి నాగయ్య అన్నారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో సలీం ఇంటికి వెళ్లి వైద్యులు వైద్యుల రిపోర్టును పరిశీలించారు. రిపోర్టు ఆధారంగా సలీంకు డెంగ్యువ్యాధి సోకలేదన్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో డెంగ్యూ పరీక్షలు నిర్వహించారని వైద్యులు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. సలీంకు సరిగా రక్తప్రసరణ కాకపోవడంతో మృతి చెందాడన్నారు.

Read More »

సాగర్‌పైనే రైతుల ఆశలు

  వర్షాల కోసం నింగికి ఎదురుచూపులు నిజాంసాగర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన వర్షాలకు రబీ సాగు గట్టెక్కించిన రైతులకు ఈసారి ఖరీఫ్‌ మళ్లీ కంటనీరు పెట్టిస్తుంది. వర్షాకాలంలో మురిపించిన వర్షాలు ఇపుడు ముఖం చాటేస్తున్నాయి. అప్పులు చేసి వరినాట్లు వేసుకున్న రైతులు నింగికేసి ఆశతో చూస్తూ నిరాశకు గురికాక తప్పడం లేదు. అప్పుడప్పుడు ఆకాశంలో నల్లని కారుమబ్బులు కమ్ముకొని ఇక భారీవర్షం వస్తుందనుకుంటున్న తరుణంలో మబ్బులు ముఖం చాటేయడంతో రైతులు దిక్కుతోచని ...

Read More »