Breaking News

Daily Archives: August 11, 2017

భూనిర్వాసితులకు నష్టపరిహారం పెంపు

  కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించే భూమికి నష్టపరిహారం ధర పెంచాలని రైతులు కోరగా కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దాన్ని పరిగణలోకి తీసుకొని ఎకరానికి 6 లక్షల 70 వేలు ధర నిర్ణయించినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. సదాశివనగర్‌ మండలంలోని భూంపల్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి భూమి కోల్పోవడం వల్ల తాము ఉపాధిని కోల్పోతున్నామని, తీవ్రంగా నష్టపోతున్నామని, మద్దతు ధర పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వంతో ...

Read More »

ప్రారంభానికి ముందే మద్యం అడ్డాగా మారిన బల్దియా కార్యాలయం

  కామరెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బల్దియా కార్యాలయం ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి బల్దియా కార్యాలయాన్ని నిర్మించగా అది ప్రారంభానికి సైతం నోచుకోలేదు. ఇదే అదనుగా మందుబాబులు మాత్రం దాన్ని దాబాగా మార్చుకున్నారు. కార్యాలయం ఆవరణలోనే మందుసీసాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, పేపర్లు దర్శనమిస్తున్నాయి. బల్దియా కాపలాదారులు ఉన్నప్పటికి నిత్యం ఇవి దర్శనమిస్తుండడం కొసమెరుపు. ఇవన్నీ బల్దియా లోపలివారే చేస్తున్నారా? బయటి వ్యక్తులు చేస్తున్నారా? బల్దియా అధికారులే ...

Read More »

రైతుల నిరసననను తెరాసపై రుద్దేందుకు ప్రయత్నం

  కామరెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం తలపెట్టిన అమరుల స్పూర్తియాత్రను రైతులు అడ్డుకొని నిరసన తెలపగా దాన్ని తెరాసపై రుద్దేందుకు ప్రయత్నించడం సమంజసం కాదని తెరాస నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆపార్టీ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, మామిండ్ల రమేశ్‌, పిప్పిరి ఆంజనేయులు, గోపీగౌడ్‌, బల్వంతరావులు మాట్లాడుతూ కోదండరామ్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌ల మారిప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకుంటున్నారన్నారు. దీనికి విద్యార్థి సంఘాలను పావులా వాడుకుంటున్నారని, తద్వారా ...

Read More »

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అరెస్టు, విడుదల

  కామరెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజేఏసి అద్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ శుక్రవారం నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్ర ఆందోళనకు దారితీయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకితీసుకొని తిరిగి హైదరాబాద్‌ తరలించినట్టు తెలుస్తుంది. అమరుల స్ఫూర్తియాత్ర కామారెడ్డి చేరుకోకంటే మునుపే బస్వాపూర్‌, భిక్కనూరులలో తెరాస రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్ఫూర్తియాత్రను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కోదండరాం వాహనశ్రేణిని అదుపులోకి తీసుకున్నారు. స్ఫూర్తియాత్ర కొనసాగిస్తే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు జరిగే ఆస్కారముందని, దాన్ని విరమించుకోవాలని సూచించారు. కోదండరాం వినకపోవడంతో ఆయన్ను ...

Read More »

భూతాపాన్ని తగ్గించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలి

  కామరెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూతాప పరిస్థితిని తగ్గించుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి జీవ ఇంధనం వినియోగం ద్వారా సాధ్యమవుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ జీవ ఇందనం దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మన జీవన విధానంలో ఉద్గారకాలు పెరిగిపోతున్నాయని, రసాయన వినియోగం వల్ల భూతాప పరిస్థితుల్లో విపరీత మార్పులు వచ్చి మానవుని మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్నారు. జీవన ప్రమాణాల్లో సమతుల్యం ...

Read More »

రణరంగంగా మారిన స్ఫూర్తియాత్ర

  – ఇరువర్గాల మధ్య ఘర్షణ – చోద్యం చూసిన పోలీసులు కామరెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ ఆవరణలో శుక్రవారం టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్రను తెరాస శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో మునిసిపల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరుల స్పూర్తియాత్ర సభాస్థలి రణరంగాన్ని తలపించింది. పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. అమరుల స్పూర్తియాత్రకు పోలీసుల నుంచి అనుమతి ఉంది. ఈ క్రమంలోనే మునిసిపల్‌ ఆవరణలో స్ఫూర్తియాత్రకు సంబంధించి ఏర్పాట్లు ...

Read More »

సెప్టెంబర్‌లోగా ప్రజలకు తాగునీరు అందించాలి

  కామరెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీటిని అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం వాటర్‌గ్రిడ్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో మిషన్‌ భగీరథ పురోగతిపై సమీక్షించారు. కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో 217 కోట్లతో అంతర్గత పనులు అంచనా ఉండగా ఇప్పటివరకు 17 కోట్ల పనులు పూర్తయ్యాయని, త్వరలో మిగతా పనులు పూర్తిచేస్తామని తెలిపారు. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా 43 ఆవాసాలు పూర్తయ్యాయని ...

Read More »