Breaking News

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

 

కామారెడ్డి, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. వాటితోపాటు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, జాతీయ పతాకావిష్కరణ, అమరవీరులకు నివాళులు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఎస్‌పి శ్వేతారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మణిమాల, తహసీల్దార్‌ రవిందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article