Breaking News

తెలంగాణ ద్రోహులు దాడిచేయడం సిగ్గుచేటు

 

కామారెడ్డి, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరవీరుల స్పూర్తియాత్ర, బహిరంగసభపై తెలంగాణ ద్రోహులు దాడిచేసి విద్యార్థి సంఘాల ప్రతినిధులను గాయపరచడం సిగ్గుచేటని టివియువి రాష్ట్ర అద్యక్షుడు రమేశ్‌ ముదిరాజ్‌ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నాలుగోవిడతలో భాగంగా కామారెడ్డి జిల్లాలో స్ఫూర్తియాత్ర నిర్వహిస్తుండగా తెరాస నాయకులు సభపై దాడిచేసి విద్యార్థి సంఘాల నాయకులను ఇష్టారీతిగా కొట్టారని పేర్కొన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేయకుండా ప్రజస్వామ్యంలో లేనట్టుగా వ్యవహరించడం గర్హణీయమన్నారు. ప్రభుత్వం తమ హామీలను విస్మరించి ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని, ప్రజాస్వామ్యం లేకుండా ఉండేవిధంగా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. 31 జిల్లాల్లో అమరుల స్ఫూర్తియాత్రను చేపట్టి తీరుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌ యాదవ్‌, రజనీకాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు భానుప్రసాద్‌, ప్రకాశ్‌నాయక్‌, సందీప్‌, నరేశ్‌, అరుణ్‌, సతీష్‌, బాలు నాయక్‌, జబ్బర్‌ నాయక్‌, సురేశ్‌, తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article