Breaking News

Daily Archives: August 15, 2017

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేలా మండల ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జనహిత భవనంలో ఆయన ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఐహెచ్‌ఎల్‌ఎల్‌ పూర్తయిన జాబితాను ఆన్‌లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రత్యేకాధికారులను నియమించిన మండలాల్లో వంధశాతం వీటిని పూర్తిచేయాలన్నారు. నూతన జిల్లాగా కామారెడ్డి ఏర్పడే నాటికి మొత్తం 323 గ్రామ పంచాయతీలకు 10 ...

Read More »

స్ఫూర్తియాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండారాం నిర్వహిస్తున్న అమరుల స్ఫూర్తియాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్యపద్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం జిల్లా సిపిఐ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై పద్మ మాట్లాడారు. ఎన్నికల్లో కెసిఆర్‌ ప్రబుత్వం ఇచ్చిన హామీలను ఎండగట్టేందుకు కోదండరాం ప్రజాస్వామ్యయుతంగా స్ఫూర్తియాత్ర చేస్తుంటే తెరాస గుండాలు దాన్ని అడ్డుకొని కమ్యూనిస్టు కార్యకర్తలను, విద్యార్థి సంఘాల ...

Read More »

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత కార్యాలయాల బాధ్యులు జెండా ఆవిష్కరించగా వివిధ ప్రయివేటు కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలలు, ప్రజా సంఘాలు, పార్టీ కార్యాలయాల్లో, కోర్టుల్లో అధికారులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన, అమరులైన వారిని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు.

Read More »

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  – ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని , వెనకబడిన వర్గాల అభ్యున్నతికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని కామారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వ్యవసాయం ద్వారా రైతులకు ...

Read More »

17న ఫోన్‌ యువర్‌ కార్‌ కోసం ఇంటర్వ్యూలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫోన్‌ యువర్‌ కార్‌ పథకం కింద కార్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 17వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ది అదికారి, జిల్లా షెడ్యూల్డు కులాల అదికారి అంజయ్య, గంగాధర్‌, దేవిదాస్‌, సోమేశ్వర్‌ తెలిపారు. ఎస్సీ, బిసి, ఎస్‌టి, మైనార్టీ నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పనలో భాగంగా అర్హత కలిగిన లైసెన్సు గల డ్రైవర్లకు కొత్త కార్లను హైదరాబాద్‌ నగరంలో నడిపేందుకు ఫోన్‌ యువర్‌ ...

Read More »

ఇష్టారాజ్యంగా చేపల వేట

  నిజాంసాగర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నిజాంసాగర్‌కు అనుసంధానంగా జలవిద్యుత్‌ కేంద్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టు డ్యాంలో ఇష్టారాజ్యంగా మత్స్యకార్మికులు చేపల వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం సబ్సిడీ కింద చేపలను విడుదల చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూలై, ఆగష్టు మాసాల్లో చేప పిల్లలను విక్రయించవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా మత్స్యకార్మికులు చేప పిల్లలను విక్రయిస్తున్నారు. హసన్‌పల్లి, కళ్యాణి, నిజాంసాగర్‌, తదితర గ్రామాల్లో మత్స్యకార్మికులు ...

Read More »

ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

  నిజాంసాగర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగరాజు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎఇవో రవిందర్‌, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి సునంద గంగారెడ్డి, వెటర్నరి కార్యాలయంలో యూనుస్‌, పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ అంతిరెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వర్లు, ఎంఇవో కార్యాలయంలో ఎంఇవో బలిరాంరాథోడ్‌ జెండా ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ...

Read More »

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  గాంధారి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాలు, కార్యాలయాలు, ఆసుపత్రుల్లో, బ్యాంకులు, వాణిజ్య సంస్థల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జెండాకు వందనం చేశారు. మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద ఆయా పార్టీల అధ్యక్షులు, యువజన సంఘాల నాయకులు జాతీయజెండా ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ సత్యం, ...

Read More »

సంత్‌సేన్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

  గాంధారి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24న సంత్‌సేన్‌ మహారాజ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గాంధారి మండల నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బియల్‌వార్‌ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24వ తేదీన నాయిబ్రాహ్మణులు సంత్‌సేన్‌ మహారాజ్‌ జయంతిలో పాల్గొనాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నాయిబ్రాహ్మణ నాయకులు పెద్దసాయిలు, సంజీవులు, శ్రీకాంత్‌, కిషన్‌, సాయిలు, సాయిబాబా, ఆంజనేయులు, సత్యనారాయణ, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వ్యాసరచన విజేతలకు బహుమతుల ప్రదానం

  గాంధారి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌, వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. గత వారం రోజుల క్రితం గాంధారి మండల కేంద్రంలోని హైస్కూల్‌లో విద్యార్థులకు స్వచ్చభారత్‌పై వ్యాసరచన పోటీ నిర్వహించారు. విజేతలకు మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జడ్పిటిసి తాజానీరావు, ఎంపిపి యశోదాబాయిలు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి శైలజ, రెండవ బహుమతి భవాని, మూడవ బహుమతి రాజేశ్‌లు అందుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్‌, ...

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

  నందిపేట, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ ఉమాకాంత్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి అంకంపల్లి యమున, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ జాన్‌రెడ్డి, పశు వైద్యాధికారి ప్రభాకర్‌, తదితర అధికారులు జెండా ఎగురవేశారు. మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపల్‌ ఫిరోజ్‌ హైదర్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ యకియుద్దీన్‌, ఎంఇవో కార్యాలయంలో ఎంఇవో లింగయ్య మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ...

Read More »

సహకార సంఘాలను శక్తివంతం చేస్తాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాలకు అవసరమున్న నిధులిచ్చి వాటిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో రూ. 75 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు నూతన కార్యాలయం, వాణిజ్య భవన సముదాయాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తు సహకార సంఘం ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో నాలుగు ఫిర్యాదులు

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో నాలుగు పిర్యాదులు అందినట్టు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి ఫోన్‌ ద్వారా నేరుగా ఫిర్యాదులు స్వీకరించారన్నారు. కామరెడ్డి-2, లింగంపేట్‌-1, దేవునిపల్లి – 1 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. సంబంధిత ఫిర్యాదులను ఎస్‌హెచ్‌వోలకు పరిష్కారం కోసం పంపించినట్టు తెలిపారు.

Read More »

రాష్ట్ర ప్రభుత్వ అవార్డులకు ఎంపికైన వారు వీరే…

  కామరెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జిల్లా స్థాయి అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గ్రూప్‌-1 అధికారి విభాగంలో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పిడి చంద్రమోహన్‌రెడ్డి, గ్రూప్‌-2 విభాగంలో డిప్యూటి మండల రెవెన్యూ అధికారి బాల్‌రాజు, గ్రూప్‌-3 విభాగంలో సిపివో కార్యాలయ డిప్యూటి స్టేటస్టికల్‌ అధికారి శివకుమార్‌, గ్రూప్‌-4 విభాగంలో బాన్సువాడ ఆర్డీవో ...

Read More »