Breaking News

జియో అభిమానులకు మరో శుభవార్త!

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జియోఫోన్’‌పై అధినేత ముఖేశ్ అంబానీ మరో శుభవార్త చెప్పనున్నట్టు సమాచారం. ఈ 4జీ పీచర్ ఫోన్ కోసం వినియోగదారులు చెల్లించిన రూ.1500లను మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గడువు తీరకముందే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలనుకున్న వారికి కూడా కొంత సొమ్ము తిరిగి ఇవ్వాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. రిఫండ్ పథకం విధివిధానాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనున్నట్టు చెబుతున్నారు.
గతనెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షికోత్సవ సమావేశంలో ముఖేశ్ అంబానీ ‘జియోఫోన్’ గురించి వివరించిన సంగతి తెలిసిందే. రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి జియో ఫోన్‌ను ఉచితంగా అందుకోవచ్చునని ఆయన ప్రకటించారు. 36 నెలల తర్వాత ఫోన్ వెనక్కిచ్చి సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి తీసుకెళ్లవచ్చునని ఆయన తెలిపారు. ఆగస్టు 24 నుంచి ‘జియోఫోన్’ ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ద్వారా రూ.24 మొదలు పలు టారిఫ్‌లపై రీచార్జ్ చేసుకున్న వారికి అపరిమిత కాల్స్‌, డేటా సేవలు జియో అందించనుంది. నెల రోజుల పాటు అపరిమిత డేటా, కాల్స్ కోసం కేవలం రూ.153 చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించడంతో వినియోగదారులు దీనికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article