Breaking News

Daily Archives: August 18, 2017

కాశీలో వదిలేసేది…

కొందరు వంకాయ తినమంటే.. ‘అబ్బే కాశీలో వదిలేశానండి!’ అంటుంటారు. కాశీలో నచ్చినవి వదిలేసే సంప్రదాయం ఉంది. ఇది పురాణాలు చెప్పిన విషయం కాదు. లౌకిక సంప్రదాయం. కాశీలో నచ్చిన వస్తువులు వదిలివేయడం వెనుక.. ఒక చక్కని బోధ ఉంది. కాశీ అంటేనే మోక్ష భూమి. ఐహిక బంధాలపై వ్యామోహాన్ని వదులుకున్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. వస్తువులపై ప్రేమ, వంటకాలపై అభిరుచి, బంధాలపై అనురాగం- ఇవన్నీ మోక్షానికి అడ్డుగా నిలుస్తాయి. కోరికలను జయించగలమనే నమ్మకాన్నీ, విషయసుఖాలను త్యజించగల స్థైర్యాన్నీ కలిగించడానికి పూర్వం రుషులు ‘కాశీలో ఇష్టమైన వస్తువును ...

Read More »

సెకన్లలో ఫోన్‌ ఫుల్‌ చార్జింగ్‌

లండన్‌: స్మార్ట్‌ ఫోన్లకు, డివైస్‌లకు ఉన్న సమస్యల్లా.. చార్జింగే! ఆ సమస్యను అధిగమించేందుకు క్యాండీ కేన్‌ను పోలి ఉండే సూపర్‌ కెపాసిటర్‌ను యూకేలోని క్వీన్‌మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, యూరివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ప్రొటోటై్‌పడ్‌ పాలిమర్‌ ఎలకో్ట్రడ్‌ శక్తిని నిల్వఉంచుకోవడం, చార్జింగ్‌ పుంజుకునేలా చేస్తుందట. ఈ టెక్నిక్‌తో సెకన్లలోనే బ్యాటరీ ఫుల్‌ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. Source:Andhra Jyothi

Read More »

‘ఆ పని అమెరికా చేయబోదు’

వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదు. కానీ, అమెరికా చేసే అణుదాడి తర్వాత ఉత్తరకొరియా, దక్షిణకొరియాలతోపాటు జపాన్‌లోనూ శవాల గుట్టలే కనిపిస్తాయని అలా జరగడం తమకు ఇష్టం లేదని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జాన్ మాటిస్ అన్నారు. అణు దాడులు ప్రపంచ వినాశనానికి కారణమవుతాయని అంతకు మించి వాటితో సాధించేదేమి ఉండదని ఆయన హితవు పలికారు. అంతేకాదు ఈ విషయాన్ని గుర్తించి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌వున్ కొంత వరకు వెనక్కు తగ్గడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అణుదాడి జరిగితే ఉత్తరకొరియా, దక్షిణకొరియాల్లో రెండు ...

Read More »

బాలకృష్ణ దవడ పగులగొట్టినందుకు ఆ అభిమాని ఉప్పొంగిపోయాడట…

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పూలదండ వేయడానికి వచ్చిన ఓ అభిమానిని హీరో బాలకృష్ణ దవడ పగులగొట్టిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తనదైనశైలిలో స్పందించారు. ‘బాలకృష్ణ దవడ పగులగొడితే ఆ అభిమాని ఉప్పొంగిపోయి ఉంటాడు. బాలకృష్ణ చేయి తాకడం అంటే పుణ్యం చేసుకున్నట్లు’ అని ఆయన వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరతీశారు. కాగా, ఆ అభిమానిపై చేయి చేసుకునే హక్కు బాలకృష్ణకు ఎవరిచ్చారనే విమర్శలు సొంత పార్టీ ...

Read More »