Breaking News

‘ఆ పని అమెరికా చేయబోదు’

వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదు. కానీ, అమెరికా చేసే అణుదాడి తర్వాత ఉత్తరకొరియా, దక్షిణకొరియాలతోపాటు జపాన్‌లోనూ శవాల గుట్టలే కనిపిస్తాయని అలా జరగడం తమకు ఇష్టం లేదని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జాన్ మాటిస్ అన్నారు. అణు దాడులు ప్రపంచ వినాశనానికి కారణమవుతాయని అంతకు మించి వాటితో సాధించేదేమి ఉండదని ఆయన హితవు పలికారు.

అంతేకాదు ఈ విషయాన్ని గుర్తించి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌వున్ కొంత వరకు వెనక్కు తగ్గడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అణుదాడి జరిగితే ఉత్తరకొరియా, దక్షిణకొరియాల్లో రెండు పక్కల అర నిమిషానికి 30 వేల మంది ప్రజలు ప్రాణాలు కొల్పోతారని ఆయన అన్నారు. అలా లెక్కిస్తే అరగంటలో 10 కోట్ల మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని మాటిస్ చెబుతున్నారు. ఉత్తరకొరియా పక్క దేశాలపై కూడా అణుదాడి ప్రభావం ఉంటుందని అలాగే అమెరికా కూడా ఆ ముప్పును ఎదుర్కొంటుందని అలా జరగకపోవడమే మంచిదని ఆయన కోరుకున్నారు.

 

Source:Andhra jyothi

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article