Breaking News

బాలకృష్ణ దవడ పగులగొట్టినందుకు ఆ అభిమాని ఉప్పొంగిపోయాడట…

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పూలదండ వేయడానికి వచ్చిన ఓ అభిమానిని హీరో బాలకృష్ణ దవడ పగులగొట్టిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తనదైనశైలిలో స్పందించారు.
‘బాలకృష్ణ దవడ పగులగొడితే ఆ అభిమాని ఉప్పొంగిపోయి ఉంటాడు. బాలకృష్ణ చేయి తాకడం అంటే పుణ్యం చేసుకున్నట్లు’ అని ఆయన వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరతీశారు. కాగా, ఆ అభిమానిపై చేయి చేసుకునే హక్కు బాలకృష్ణకు ఎవరిచ్చారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
కాగా, బుధవారం రాత్రి నంద్యాలలో తన అభిమాన హీరో బాలకృష్ణకు పూల దండ వేసి, ఆయనతో ఓ ఫొటో దిగాలని భావించిన ఓ అభిమానికి తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సోమిశెట్టి స్పందించారు
Source:Web Dunia

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article