Breaking News

రూ.250 పెట్టి కొంటే.. రూ 4853 కోట్ల బంపర్ లాటరీ

మసాచుయేట్స్:53 ఏళ్ల వృద్ధురాలు.. 30 ఏళ్లుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు. కన్నతల్లితో పాటు ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. సాధారణంగా అయితే ఆమె జీవితం కష్టాలకు నిలయంగా ఉండేదేమో. కానీ ఊహించని కారణం వల్ల ఆమె ఒక్కసారిగా కోటీశ్వరురాలు అయింది. అమెరికాలోని మసాచుయేట్స్‌కు చెందిన 53 ఏళ్ల మావీస్ ఎల్.వాన్‌జీక్‌కు బుధవారం రాత్రి ఓ ఫోన్ కాల్ వెళ్లింది. ఆ ఫోన్‌లో అవతలి వాళ్లు మాట్లాడింది విని అస్సలు నమ్మలేకపోయింది. తాను వింటున్నది నిజమో కాదో అన్న టెన్షన్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత కోలుకుని అసలు విషయం నిర్ధారణ చేసుకుని తనవాళ్లతో కలిసి సంతోషాన్ని పంచుకుంది. 

కేవలం నాలుగు డాలర్లు పెట్టి కొన్న ఓ లాటరీ ఆమెను అదృష్టం వరించేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 758.7 మిలియన్ డాలర్లను గెలుచుకుంది. అంటే మన రూ.250 పెట్టి కొన్న లాటరీ… రూ 4853 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిందన్నమాట. ‘పవర్ బాల్ జాక్‌పాట్’ పేరిట ప్రతియేటా నిర్వహించే ఈ లాటరీలో మావీస్ అదృష్టవంతురాలిగా నిలిచింది. కొద్ది నెలల క్రితం.. తన పుట్టిన రోజు సంఖ్యలు ఉండేట్లుగా పవర్ బాల్ లాటరీని కొన్నానని ఆమె తెలిపింది. ఎప్పటికయినా ఈ లాటరీ విజేతగా నిలవాలని అనుకునేదాన్నని తెలిపింది.  అన్ని రకాల టాక్సులు, ప్రాసెసింగ్ ఫీజులు పూర్తయ్యాక.. 2150 కోట్ల రూపాయలు ఆమె సొంతం అవుతాయని నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఉన్న అప్పులు తీర్చేసి, కొంత విరాళంగా ఇచ్చి, మిగిలిన డబ్బుతో ఏం చేయాలనేది ఆలోచిస్తానని చెబుతోందామె. శుక్రవారం తన ఇద్దరు కూతుళ్ల, తల్లితో సహా వచ్చి లాటరీ నిర్వాహకులు ఇచ్చిన చెక్‌ను తీసుకుంది. మొత్తానికి ఓ సాదారణ ఆయా.. ఒక్కసారిగా కోటీశ్వరురాలు అవడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిందామె.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *