Breaking News

కత్తి మహేశ్‌కు పవన్ ఫ్యాన్స్ బెదిరింపులు

సినీ విమర్శకుడు కత్తి మహేశ్ గురించి గతంలో ఎవరికీ పెద్దగా తెలియదు. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత కత్తి మహేశ్ గురించి చాలా మందికి తెలిసింది. అయితే ఈ షో నుంచి కత్తి మహేశ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి, రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి కత్తి మహేశ్ మాట్లాడాడు. వృత్తి రీత్యా విమర్శకుడు కావడం వల్లనో.. ఏమో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కత్తి మహేశ్ సోషల్ మీడియా పేజ్‌ల్లో బెదిరింపు థోరణిలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు.
దీంతో కత్తి మహేశ్ కూడా ఎదురు దాడికి దిగాడు. కామెంట్స్ చేస్తున్న కొందరికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రిప్లై ఇస్తున్నాడు. దీంతో ఈ వివాదానికి ఎప్పటికి తెరపడుతుందోనన్న ఆసక్తి ఇతర హీరోల అభిమానుల్లో నెలకొంది. గతంలో కాటమ రాయుడు సినిమాకు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తనను చంపుతామని పవన్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నట్లు కత్తి మహేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇంటర్వ్యూతో మరోసారి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కత్తి మహేశ్ గురయ్యాడు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *