Breaking News

అర్జున్ రెడ్డి ప్రీమియర్స్‌కు రికార్డు స్థాయి కలెక్షన్లు

అర్జున్‌ రెడ్డి.. విజయ్ దేవరకొడ హీరోగా, షాలిని పాడే హీరోయిన్‌గా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ట్రైలర్, ముద్దు ఫోటోలను చించేసిన కాంగ్రెస్ నేత వీహెచ్, వర్మ కామెంట్స్.. వెరసి సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలైన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. 
అర్జున్ రెడ్డి ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్స్ కొనుగోలు చేసింది. అమెరికాలో 85 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల అయింది. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఒక రోజు ముందే.. అంటే గురువారం రాత్రే ఈ సినిమా విడుదలయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గురువారం ప్రీమియర్ల వద్ద సినీ ప్రేక్షకులు సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా అర్జున్ రెడ్డి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృదం ఫుల్ ఖుషీగా ఉంది. ఒక్క అమెరికాలోనే గురువారం రాత్రి ప్రీమియర్ల ద్వారా లక్షా 70వేల డాలర్లను కలెక్ట్ చేసినట్లు నిర్వాణ సినిమాస్ ప్రకటించింది. ఇంకా కొన్ని థియేటర్ల నుంచి సమాచారం రావాల్సి ఉందని మొత్తం మీద ప్రీమియర్ షోల ద్వారా 2 లక్షల డాలర్లను (ఒక కోటి 28 లక్షల 3వేల రూపాయలు) కలెక్ట్ చేసే అవకాశం ఉందని తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు. ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగితే విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ తర్వాత ఓవర్సీస్‌లో మరోసారి అర్జున్‌రెడ్డితో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ ప్రియులు చెబుతున్నారు.
Source: Andhra jyothi

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *