Breaking News

బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ హీరో.. ఒప్పించిన డైరెక్టర్..?

 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రిన్స్ మహేశ్ బాబు ‘స్పైడర్’ ప్రచారం నిదానంగా ఊపందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ వినూత్న పద్ధతిలో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు మురుగదాస్.
        చిన్న చిత్రాలే కాదు… భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇప్పుడు అన్ని రకాల ప్రచారాల పైనా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు జనం టీవీలను అతుక్కుపోతుండటంతో, అందులో ప్రసారమయ్యే సీరియల్స్, షోస్ ద్వారా బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ట్రెండ్ ఇటీవల దక్షిణాదికీ పాకింది. ఎన్టీయార్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ షో ద్వారా ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీని రానా, ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని తాప్సీ, ‘అర్జున్ రెడ్డి’ సినిమాని విజయ్ దేవరకొండ ప్రచారం చేసుకున్నారు.
         అందుకోసం పూణేలోని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళి మూడు నాలుగు గంటలు గడిపి వచ్చారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘స్పైడర్’ ప్రమోషన్ కోసం ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ‘బిగ్ బాస్ హౌస్’కు వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. అయితే… అది తమిళ బిగ్ బాస్ షో కోసమట. ‘స్పైడర్’ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. అక్కడ మహేశ్‌కు పెద్దంత గుర్తింపులేదు కాబట్టి భారీగా పబ్లిసిటీని చేయాలని దర్శకుడు మురుగదాస్ భావిస్తున్నాడట. అందుకనే కమల్ నిర్వహిస్తున్న తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనేలా మహేశ్‌ను ఒప్పించాడట. కమల్ మీద ఉన్న గౌరవం, ఆయన కూతురు శ్రుతీహాసన్‌తో ఉన్న అనుబంధం కారణంగా మహేశ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మరి పనిలో పనిగా తెలుగు బిగ్ బాస్ హౌస్‌కు కూడా మహేశ్ వెళితే సూపర్‌గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ను, ప్రిన్స్ మహేశ్ బాబును స్మాల్ స్ర్కీన్ లో ఒకే ఫ్రేమ్‌లో చూడడం సినిమా అభిమానులందరికీ పండగే అనడంతో సందేహం లేదు. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article