Breaking News

Daily Archives: August 28, 2017

స్పెయిన్‌పై పంజా విసిరిన ఉగ్రభూతం

ఉగ్రవాదం మరోసారి పంజా విసిరింది. ఈసారి స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై వాహనంతో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంలో పధ్నాలుగు మంది మృతి చెందగా, మరో 50మంది వరకూ క్షతగాత్రులయ్యారు. ఇందులో పదహారు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి. గురువారం బార్సిలోనాలోని లస్‌రంబ్లస్‌ రహదారిలో రద్దీగా ఉన్న సమయంలో పాదయాత్రల పైకి ఒక వ్యానుతో ఉగ్ర వాదులు దూసుకువెళ్లి ఈ మారణ హోమాన్ని సృష్టిం చారు. ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న వారిలో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతిచెందినట్లు ...

Read More »

‘ఉత్తరకొరియా మరోసారి న్యూక్లియర్ టెస్ట్ జరపబోతోంది’

వాషింగ్టన్: ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్‌లు జరిపేందుకు సిద్ధమవుతోందని దక్షిణకొరియా నిఘా సంస్థ యోన్హాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్య సమితి వద్దని వారించినా, ఆ దేశంపై ఎన్నో ఆంక్షలు విధించినా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తుండటం, మరో అణ్వస్త్ర పరీక్షకు సిిద్ధం అవుతోందన్న వార్తలు వస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరుకున్నాయనీ, అయినా  ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ...

Read More »

తినండి..! బరువు తగ్గండి!!

 ఏ రెండు పదార్థాలూ ఒకేలా ఉండనట్టే ఏ రెండు రకాల క్యాలరీలూ మన శరీరంలో ఒకేలా ఖర్చవవు. అయితే కొన్ని పదార్థాలు మన మెటబాలిజమ్‌ను పెంచే నెగిటివ్‌ క్యాలరీ ఎఫెక్ట్‌ కూడా కలిగి ఉంటాయి. అలాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోగలిగితే బరువును అదుపులో ఉంచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. పీచు పదార్థాలు: మొక్కల ఉత్పత్తులైన చిక్కుళ్లు, పళ్లు, అపరాలు, కొన్ని రకాల కూరగాయల్లో నీరు, పీచు శాతం ఎక్కువ. ఇవి తిన్నప్పుడు మన శరీరం వీటిలోని పీచును జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ...

Read More »

దంపుడు బియ్యంతో బరువు తగ్గొచ్చు !

శరీరంలోని అదనపు బరువును వదిలించుకోవాలా.. అయితే, దంపుడు బియ్యం(బ్రౌన్‌ రైస్‌) తినండి అంటూ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. సాధారణ బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం ఆరోగ్యకరమనే విషయం తెలిసిందే! రోజువారీ ఆహారంలో దంపుడు బియ్యం సహా ఇతర తృణధాన్యాలకు చోటివ్వడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుందని, బరువు తగ్గి చురుకుదనం పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చిందని టఫ్ట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోజువారీగా మనం ఖర్చుచేసే కాలరీలకు అదనంగా వంద కాలరీలను శరీరం వదిలించుకుంటుందని తెలిపారు. ఇక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పునూ ఈ తృణధాన్యాలు ...

Read More »

మోసపోయిన సినీనటి

ఓ చిట్‌ఫండ్ కంపెనీ తనను మోసంచేసిందంటూ సినీనటి సంజన ‘రిజిస్ట్రార్ అఫ్ కో ఆపరేటివ్ సొసైటీ’ వారికి ఫిర్యాదు చేసింది. బెంగళూరు లోని మల్లేశ్వరంలో ఉన్న ప్రసిద్ధి అనే చిట్‌ఫండ్స్ కంపెనీలో తాను రూ.26లక్షలు పెట్టగా ప్రస్తుతం కంపెనీ మూసివేసి యజమానులు కనిపించకుండా పోయారని ఈ ఫిర్యాదులో పేర్కొంది. సంస్థ యజమానులు మహేష్, అతని భార్య నిరూపలను వెంటనే వెతికి పట్టుకోవాలని అందులో కోరింది. దీనిపై ఆగస్టు 19న పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదుచేశారు. విచారణ చేప్పట్టిన పోలీసులు ఈ సంస్థ దాదాపుగా 100 ...

Read More »

అమెజాన్‌లో మళ్లీ ఆఫర్ల వాన!

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా మళ్లీ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆపిల్ ఐఫోన్లు, వాచ్‌లు, ఐప్యాడ్‌లు, ఐమ్యాక్‌లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్‌ పేరుతో నేడు ప్రారంభమైన ఈ ఆఫర్ల వాన రేపటి వరకు కురియనుంది. ఫెస్ట్‌లో భాగంగా ఐఫోన్ 7, ఐఫోన్ 6, ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. ఐఫోన్ 7, 32 జీబీ వేరియంట్‌పై రూ.11,201 డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఎక్స్‌చేంజ్‌పై అయితే రూ.14,920కే అందిస్తున్నట్టు పేర్కొంది. ఐఫోన్ 6, 32 జీబీ వేరియంట్‌పై రూ.3501, ఎక్స్‌చేంజ్‌‌లో ...

Read More »