Breaking News

Daily Archives: August 31, 2017

పవన్ ట్వీట్లు చేయడమే ఘన కార్యంగా భావిస్తే..: కత్తి మహేశ్

మహేశ్ కత్తి-పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య రాజుకున్నఅగ్గి ఇంకా చల్లారలేదు. పవన్‌కు యూత్‌లో చాలా క్రేజ్ ఉంది. ఆయనను చిన్న మాట అన్నా సహించలేని అభిమాన గణం ఉంది. దీంతో మాటకు మాట పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా మహేశ్ ఓ టీవీ షోలో జరిగిన చర్చలో భాగంగా పవన్ అభిమాని కాల్‌కు సమాధానంగా “ఎవరయ్యా మెగా ఫ్యామిలి? ఐ కేర్ ఇట్ డామ్ ఎబౌట్ ఎనీ ఫ్యామిలీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ.. ఎవరీ మెగా ఫ్యామిలీ.. మీరేమైనా ఫ్యూడల్ ...

Read More »

సినీఫక్కీలో పారిపోయేందుకు డేరా బాబా ప్లాన్!

న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ సింగ్ పోలీసుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన మాట నిజమేనని తేలింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 20 యేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే ఆయన సినీఫక్కీలో తప్పించుకునేందుకు ముందుగానే పథకం రచించినట్టు హర్యానా ఐజీ (ఐఆర్బీ) కేకే రావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. పంచకుల కోర్టువద్ద పోలీసులు చుట్టుముట్టి ఉండకపోతే తన ప్రయివేటు సైన్యంతో కలిసి ...

Read More »

జియోఫోన్ ఆన్ చేస్తే ఏం చూపిస్తుందో తెలుసా..!

న్యూఢిల్లీ: గ్రామీణులకు సైతం 4జీ టెక్నాలజీ రుచిచూపించేందుకే రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జియోఫోన్’… విడుదలకు ముందే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకున్నవారు ఎప్పుడు తమ చేతికి వస్తుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జియోఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉంటాయి.. నాణ్యత సంగతేంటి… ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియో జియో అభిమానుల అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఫోన్ ఆన్ చేయగానే జియో డిజిటల్‌ లైఫ్ అన్న లోగోతో స్వాగతం పలుకుతోంది. ఆన్‌చేసిన ...

Read More »

నగల దుకాణంలో పామును వదిలి..నగలు దోచుకొని వెళ్లి…

లేడీ కిలాడీల నయా మోసం రాంపూర్ : నగల దుకాణంలో పామును వదిలి…నగలను దోచుకెళ్లిన లేడీకిలాడీల బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. సినీఫక్కీలో జరిగిన ఈ నగల దోపిడీ ఘటన యూపీలో సంచలనం రేపింది. రాంపూర్ పట్టణంలోని మెస్టన్ గంజ్ లో ఉన్న పరితోష్ చాందీవాలా నగల దుకాణానికి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. వస్తూనే నగల దుకాణంలోకి ఓ పామును వదిలిపెట్టారు…పామును చూసిన నగల దుకాణం యజమాని పరితోష్ భయంతో దుకాణం వదిలి బయటకు పరుగులంకించుకున్నాడు. అంతే ఆ మహిళలు ...

Read More »