శృంగారానికి మూడ్‌ వచ్చే వారాలు

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే శృంగా రంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజు మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. అయితే కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది. పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయ డానికి కేవలం పదిశాతం మంది మాత్రమే సిద్ధ పడుతున్నారట. అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది. మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపు తున్నారట. పైగా శృంగార కోరికలనేవి వేసవి కాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయస్సుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది.

Check Also

వార్‌ వన్‌ సైడే : ఎంపీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే అని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *