Breaking News

గడువు తీరితే రోజుకు రూ.200 ఫైన్‌

GST Image

న్యూఢిల్లీ: జీఎస్టీ కింద తొలి రిటర్న్‌ దాఖలు చేయని వారికి ఫైన్‌ విధించాలన్న జీఎస్టీ కౌన్సిల్‌ సూచనను ప్రభుత్వం
జూలై నెలకు రద్దు చేసింది. గడువులోపు రిటర్న్‌ దాఖలు చేయనివారికి రోజుకు రూ.200 చోప్పున రుసుము
విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేసింది. జూలై నెలకు జీఎస్టీని రద్దు చేసింది. జూలై నెలకు సంబంధించి
ఆగస్టు 25 నాటికి దాఖలు చేయాల్సిన జీఎస్టీఆర్‌-3బిలో జాప్యంపై అపరాధ రుసుము మాత్రమే రద్దు చేశాం.
చెల్లించాల్సిన పన్ను మొత్తానికి వడ్డీ మాత్రం కొనసాగుతుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది.
లోగడ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ గడువులోగా జీఎస్టీ రిటర్న్‌ దాఖలు చేయకపోతే రోజుకు రూ.200
అపరారధ రుసుము విధిస్తామన్నారు. దీనిలో 100 సెంట్రల్‌ జీఎస్టీ కింద, రూ.100 స్టేట్‌ కింద విధిస్తామని
తెలిపారు. జూలౌ నెలకు సంబంధించి 59లక్షల మంది రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉండగా కేవలం 38లక్షలు మంది
మాత్రమే దాఖలు చేయడం గమనార్హం.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *