Breaking News

Daily Archives: September 4, 2017

పిట్లంలో ఘనంగా గణేష్‌ నిమజ్జనం

  పిట్లం, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలో వినాయక నిమజ్జనం ఆదివారం మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి నవరాత్రులలో కొలువు దీరిన గణనాథులను రథంపై ఉంచి భాజీ బజంత్రీల నడుమ, బ్యాండు శబ్దాలతో, యువకులు, చిన్న, పెద్ద కేరింతలు, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ చెరువుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి, జడ్పిటిసి ప్రతాప్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి నర్సాగౌడ్‌, ఎంపిటిసి జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

60 ఏళ్ళు నిండిన ప్రతిపేదరైతుకు రూ. 10 వేల పింఛన్‌ ఇవ్వాలి

  – సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని, దీన్ని మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు పదవీ విరమణ చెందితే వారికి పింఛన్‌ సౌకర్యం ఉందని, ...

Read More »

నేడు తపస్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తపస్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుందని సంఘం ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నట్టుతెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభివృద్దికి కృసి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్టు తెలిపారు. వారిలో ముత్యాల రమేశ్‌, అయిత్‌వార్‌ గంగరాజు, తంజాల శంకరయ్యగౌడ్‌, గాడెరంగడి పద్మ, రాయ రంగమ్మ ఉపాధ్యాయులను సన్మానించనున్నట్టు తెలిపారు.

Read More »

10న న్యాయవాదపరిషత్‌ రజతోత్సవ సమావేశం

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద పరిషత్‌ రజతోత్సవ జాతీయస్థాయి సమావేశం ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణానంద్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌అసోసియేషన్‌ సమావేశమందిరంలో ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రజతోత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌సంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ హాజరవుతారని వివరించారు. జాతీయవాద దృక్పథంతో సమాజసేవ చేయాలనే మహా సంకల్పంతో 1992లో న్యాయవాద ...

Read More »

కరక్కాయతో లాభాలెన్నో!

కరక్కాయ చూర్ణం ఒక భాగం, వేయించిన పిప్పళి చూర్ణం సగభాగం కలిపేయాలి. అందులోంచి ఒక గ్రాము చూర్ణాన్ని తేనెతో ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున సేవిస్తే కోరింత దగ్గు తగ్గిపోతుంది. పసుపు కొమ్ము రసాన్ని ఇనుప పాత్రలో ఉంచి వేడిచేస్తూ, కరక్కాయ కల్కాన్ని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం లేపనంగా వేస్తే ‘గోరు చుట్టు వాపు ’రోగం శమిస్తుంది. ఒకటి రెండు చెంచాల కరక్కాయ పొడిని భోజనానికి ముందు మజ్జిగతో సేవిస్తే స్థూలకాయం తగ్గుతుంది. కరక్కాయ చూర్ణాన్ని తేనెతో ...

Read More »

ఉత్తరకొరియా ధూర్తదేశం.. బుజ్జగింపులు పనికిరావు

ఆ దేశం మాటలు, చేతలు మాకు ప్రమాదకరం: ట్రంప్‌ అణు పరీక్షలు ఆమోదయోగ్యం కాదు: జపాన్‌ ప్రధాని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన అమెరికా ఆర్థిక శాఖ ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబు ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ మాటలు, చేతలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రమాదకరంగా కొనసాగుతున్నాయంటూ వరుస ట్వీట్లతో హోరెత్తించారు. ఉత్తర కొరియాను ఒక ధూర్త దేశంగా అభివర్ణించారు. ఆ దేశం చైనాకు పెనుముప్పుగా, సిగ్గుచేటుగా తయారైందన్నారు.‘‘‘ఉత్తరకొరియాను బుజ్జగించడం వల్ల ఉపయోగం లేదు. వారికి అర్థమయ్యే భాష ...

Read More »

బాంబులో బాంబు!

హైడ్రోజన్‌ బాంబు పేలాలంటే అణుబాంబు కావాలి 5 కోట్ల డిగ్రీల నుంచి 40 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత పుట్టాలి కేంద్రక విచ్ఛిత్తితో అణుబాంబు.. సంలీనంతో హైడ్రోజన్‌ బాంబు అణు బాంబును కేంద్రక విచ్ఛిత్తి పద్ధతిలో తయారు చేస్తారు. యురేనియ, థోరియం, ఫ్లుటోనియం వంటి రేడియో ధార్మిక పదార్థాల భార కేంద్రకాలు తక్కువ శక్తిగల న్యూట్రాన్లను శోషించుకుని విచ్ఛిన్నం చెంది శక్తిని విడుదల చేసే ప్రక్రియను కేంద్రక విచ్ఛిత్తి అంటారు. ఈ పద్ధతి ద్వారా అణుబాంబులు పేలినప్పుడు విడుదలయ్యే శక్తి కిలోటన్నుల్లో ఉంటుంది. ఆ శక్తి ...

Read More »