Breaking News

Daily Archives: September 5, 2017

మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా వ్యవహరించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సమాఖ్య గ్రూపుల మహిళలు మిగతావారికి స్ఫూర్తిగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా మహిళా సహకార సమాఖ్య కామారెడ్డి జిల్లా మొదటి వార్సిక మహాసభ నిర్వహించారు. దీనికి కలెక్టర్‌ ముక్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2015-16లో సాధించిన విజయాలను 2017-18 చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. గత విజయాలను నెమరువేసుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా స్వర్ణలత, కార్యదర్శిగా ...

Read More »

అత్యుత్తమమైనది ఉపాధ్యాయ వృత్తి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అతి ఉత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై సుష్మ మాట్లాడుతూ అధ్యాపకుల పాత్ర గణనీయమైందన్నారు. సమాజాభివృద్దికి వారే మార్గదర్శకులని పిల్లలను సన్మార్గంలో నడపాలని కోరారు. ఎందరో మేధావులు ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే ఎదిగారని చెప్పారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఆమె సన్మానించారు. ...

Read More »

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో రాధాకృస్ణన్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. విద్యార్థులే గురువులుగా పాఠాలు బోధించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఆట, పాటలతో హోరెత్తించారు. తమ నైపుణ్యం ప్రదర్శించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.

Read More »

అర్హులైన వారందరికి చీరలు పంపిణీ చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపినీ కార్యక్రమంలో అర్హులైన మహిళలందరికి చీరలు పంపినీ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో కాకుండా గ్రామాల్లో అనువైన గోదాములను ఎంపిక చేయాలని, అక్కడినుంచే పంపిణీ చేయాలని సూచించారు. గోదాముల్లో ప్రభుత్వ ఉద్యోగిని ఇన్‌చార్జిగా నియమించుకోవాలని, పాఠశాలలు, అంగన్‌వాడి కార్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు కలిగిన గోదాములను ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. 18 ...

Read More »

రైతుల సమగ్ర వివరాలు సేకరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పత్తి పంట వేసిన రైతుల సమగ్ర వివరాలను సర్వే నిర్వహించి ఈనెల 11లోగా సేకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ చాంబరులో రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. గత సంవత్సరం 20 వేల 655 ఎకరాల్లో పత్తివేశారని ఈయేడు రెట్టింపుగా 49 వేల 781 ఎకరాల్లో పత్తి వేశారని తెలిపారు. ఎకరాకు 8 నుంచి 10 ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ వారి ఆద్వర్యంలో మంగళవారం బీర్కూర్‌ గ్రామాలలో 54 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9 మందికి మోతి బిందు ఉన్నట్టు గుర్తించి వారిని ఆపరేషన్‌ నిమిత్తం బోధన్‌ లయన్స్‌ ఆసుపత్రికి తరలించినట్టు క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు.

Read More »

బీర్కూర్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తపస్‌ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఘనంగా సన్మానించారు. సన్మానం పొందినవారిలో రమేశ్‌, టి.శంకరయ్య, ఏ.గంగరాజు, పద్మ, రంగమ్మ ఉన్నారు. ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం కార్యక్రమం నిర్వహించినట్టు తపస్‌ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌, జిల్లా కార్యదర్శి రవింద్రనాథ్‌ ఆర్య, వెంకట్రావు, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా గణేష్‌ నిమజ్జనం

  నందిపేట, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రాత్రి నందిపేట మండలంలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం భక్తుల కోలాహలం నడుమ, యువకులు, చిన్నారుల కేరింతలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు దాండియా నృత్యాలు చేస్తు ఘననాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనం సందర్భంగా జమే మసీద్‌ నందిపేట మజీద్‌ కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ జమిల్‌ హిందు సోదరులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. వినాయక శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేంత వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నందుకుగాను ఏసిపి శివశంకర్‌, ...

Read More »

నేడు కామారెడ్డి జిల్లా బంద్‌

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నిమజ్జనోత్సవంలో పోలీసుల అత్యుత్సాహం, నిర్భంద వైఖరిని నిరసిస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా పోలీసుల వైఖరిని నిరసిస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్‌ ఉత్సవ కమిటీ, విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తబస్టాండ్‌ వద్ద రాస్తారోకో, ధర్నా చేశారు. గణేష్‌ మండలీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా బంద్‌కు నిర్ణయం తీసుకున్నారు. ...

Read More »

గ్రామరైతులంతా సంఘటితం కావాలి

  గాంధారి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలన్ని సంఘటితం కావాలి, రైతులంతా ఏకం కావాలని తద్వారా అభివృద్ది చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గాంధారి మండలం పేట్‌సంగం గ్రామంలో గ్రామ రైతుసమన్వయ సమితి ఏర్పాటు చేసిన సందర్భంగా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ వారి కళ్ళల్లో సంతోషం చూడడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి రైతుకు ఎకరాకు 8 వేల ...

Read More »