Breaking News

Daily Archives: September 6, 2017

వెల్లుట్ల గ్రామ రెవెన్యూ అధికారిపై సస్పెన్షన్‌ వేటు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామ రెవెన్యూ అధికారి బాల్‌రాజుపై జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బుధవారం సస్పెన్షన్‌ వేటు వేశారు. ఫోర్జరీ సంతకాలతో పట్టాలు అనే వార్త బుధవారం పలు పత్రికల్లో వచ్చింది. దీనిపై తహసీల్దార్‌ విచారణలో రెవెన్యూ అధికారి బాల్‌రాజ్‌ తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసినట్టు, పాస్‌బుక్‌కు, టైటిల్‌లీడ్‌కు డబ్బులు తీసుకుంటున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. తహసీల్దార్‌ విచారణ నివేదికను ఎల్లారెడ్డి ఆర్డీవోకు అందజేయగా, కలెక్టర్‌కు సమర్పించారు. నివేదిక అనంతరం బాల్‌రాజుపై సస్పెన్షన్‌ ...

Read More »

చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలోని చెరువులో చేపల వేటకెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం కామరెడ్డి శివారులోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ సలీం (19), అమీర్‌ (20), మరో నలుగురు మిత్రులతో కలిసి రామేశ్వర్‌పల్లి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్ళారు. సలీం చెరువుపక్కన కూర్చొని గాలంతో చేపలు పడుతుండగా కాలుజారి చెరువులో పడ్డాడు. అతన్ని కాపాడబోయి చేయి ...

Read More »

విదులు బహిష్కరించిన న్యాయవాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నిమజ్జనం సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిర్వహించిన బంద్‌కు కామారెడ్డి బార్‌ అసోసియేషణ్‌ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుధవారం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు సమావేశమై విధులు బహిస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి హక్కులను వారు కాపాడుకునే ఆస్కారముందని, ఎవరి పండగలు వారు ఘనంగా నిర్వహించుకునే వీలుందన్నారు. ప్రజల హక్కులను కాలరాసే అధికారం ఎవరికి లేదని ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామరెడ్డి ఆద్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ మాట్లాడుతూ ఉత్తమ విద్య అందించినట్లయితే గురువుగా విద్యార్తిని ఉత్తమంగా తయారు చేయవచ్చని తెలిపారు. దీనిద్వారా సమాజంలో ఉపాధ్యాయుల కీర్తి ఘనంగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు రమేశ్‌, కార్యదర్శి నిమ్మ దామోదర్‌రెడ్డి, ప్రతినిధులు రాజేశ్వర్‌, వెంకటేశ్వర్‌రావు, రాంగోపాల్‌రావు, దామోదర్‌రెడ్డి, ...

Read More »

కామారెడ్డి బంద్‌ విజయవంతం

  – కదం తొక్కిన గణేష్‌ భక్త బృందం కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల నిర్బంద వైఖరిని నిరసిస్తూ బుధవారం నిర్వహించిన కామారెడ్డి బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్‌ బంక్‌లు, సినిమా థియేటర్లు, దుకాణదారులు స్వచ్చందంగా పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, గణేష్‌ ఉత్సవ కమిటి ప్రతినిదులు ఇచ్చిన బంద్‌ పిలుపునకు అన్ని రంగాల ప్రజలతోపాటు అన్ని పార్టీల నుంచి విశేష స్పందన లభించింది. తొలిసారిగా ...

Read More »

ఆంగ్లభాషపై గ్రంథాలయ పాఠకులకు శిక్షణ

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారెస్టు డిపార్టుమెంట్‌లో టిఎస్‌పిఎస్‌సి వారు నిర్వహించే ఖాళీల భర్తీకిగాను ఆంగ్లభాషపై గ్రంథాలయ పాఠకులకు శిక్షణ ఇచ్చినట్టు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నర్సింలు తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. గిరిరాజ్‌ కళాశాల అధ్యాపకులు వరప్రసాద్‌ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ అందించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ విక్రాంత్‌, గ్రంథపాలకుడు అవినాస్‌ రాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

కలకలం రేపిన ఫేస్‌బుక్‌ ఫోటో

  పోలీసుల సమయస్పూర్తితో సద్దుమణిగిన వివాదం – పోలీసు నిఘాలో నందిపేట్‌ నందిపేట, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఓవివాదం చినుకు చినకు గాలివానలా మారింది. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో వివాదాస్పద ఫోటోను తన ప్రొపైల్‌గా మంగళవారం సాయంత్రం పోస్టు చేశాడు. రెండు మూడు గంటలలోపు మరో వర్గం ప్రజలకు తెలియడంతో ఫోటో పోస్టుచేసిన యువకునిపై చర్య తీసుకోవాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ...

Read More »

జిల్లా త్రోబాల్‌ క్రీడలకు ఎంపికైన బ్లూబెల్స్‌ విద్యార్థులు

  పిట్లం, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోగల బ్లూబెల్స్‌ పాఠశాల విద్యార్థులు జిల్లా త్రోబాల్‌ క్రీడలకు ఎంపికైనట్లు క్రీడా ఉపాధ్యాయులు ధర్మవీర్‌, సుధాకర్‌ తెలిపారు. గత సోమవారం కామారెడ్డి జిల్లా కుప్రియాల్‌ గ్రామంలో నిర్వహించిన త్రోబాల్‌ పోటీల్లో బ్లూబెల్స్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో ద్వితీయస్థానంలో నిలవడంతో జిల్లా క్రీడలకు ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 63వ జోనల్‌ స్థాయి క్రీడల్లో బ్లూబెల్స్‌ విద్యార్థులు లక్ష్మణ్‌, కార్తీక్‌, వంశీ, తరుణ్‌, నవీన్‌, వెంకట్‌, జోన్‌వెస్లిలు ఉన్నారు. ...

Read More »

స్వచ్ఛత అంటే ఇదేనా…

  ఇష్టారాజ్యంగా వ్యర్థాల పారవేత – వాడిన సూదులు, సిరంజిలతో ప్రమాదం – ఆర్‌ఎంపి, పిఎంపిల నిర్వాకం – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు – పట్టించుకోని పాలకవర్గం గాంధారి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చత కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా కిందిస్థాయిలో అది అమలు కావడం లేదు. వాడి చెడిపోయిన వ్యర్థాలను ఊరి చివర డంప్‌యార్టులు ఏర్పాటు చేసి అందులో పారవేయాలని ఎన్నిసార్లు సూచించినా పట్టించుకునే నాథుడే లేడు. అలాంటి వ్యర్థాలను గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ...

Read More »

రైతులకు లబ్దిచేకూర్చేందుకే సమన్వయ సమితీలు

  పిట్లం, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల రైతులకు లబ్ది చేకూరేందుకే సమన్వయ సమితిలు ఏర్పాటు చేయనున్నామని ఏఎంసి ఛైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి అన్నారు. ఆయన బుధవారం పిట్లం మండలంలోని బుర్నాపూర్‌, ధర్మారం గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించారు. తెరాస ప్రభుత్వం రైతుల అభివృద్ది, ఆర్థికంగా ఎదగాలనే సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తుందని, ఈ సమితిలతో రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి రూ. 6500 కోట్లు విడుదల చేసి సమన్వయ ...

Read More »

ఎస్‌టి నిరుద్యోగులకు రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

  పిట్లం, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలో ఎస్‌టి నిరుద్యోగ యువతి, యువకులకు 2017-18 సంవత్సరానికి గాను రాయితీ రుణాల కొరకు ఈనెల 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఎంపిడివో పర్బన్న తెలిపారు. పిట్లం మండలానికి 28 యూనిట్లు మంజూరయ్యాయని, ఆసక్తిగల యువతీ, యువకులు వారి విద్యార్హత, పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read More »

సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షుని మృతి

  పిట్లం, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం షిర్టిసాయిబాబా ఆలయ కమిటి అధ్యక్షుడు ఉడుగుల కృస్ణయ్య గుండపోటుతో మృతి చెందాడు. మంగళవారం జ్వరంఓ బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా వైద్యం నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. పిట్లం మండల ప్రముఖ వ్యాపారవేత్త, రైస్‌మిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా ఉన్న కృష్ణయ్య మృతి చెందడంతో పిట్లం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More »