Breaking News

Daily Archives: September 7, 2017

వ్యాక్సినేషన్‌ కేంద్రాల తనిఖీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని ఎంఆర్‌ సెషన్‌లను గురువారం జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ మధుశ్రీ తనిఖీ చేశారు. ముస్లిం పాఠశాలలో, మదర్సాలలో టీకాల పట్ల ఉన్న అపోహతో కొందరు తమ పిల్లలకు టీకా తీసుకోవడానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న డిఎంఅండ్‌హెచ్‌వో మదర్సాలను, ముస్లిం పాఠశాలలను, ముస్లిం వాడలను సందర్శించారు. వారితో మాట్లాడి టీకాల పట్ల అవగాహన కల్పించారు. అనుమానాలు నివృత్తి చేశారు. ఎంఆర్‌ క్యాంపెన్‌లో సరైన ప్రణాళిక చేయకుండా, పర్యవేక్షణ చేయనందుకు హెచ్‌ఇవో సాయిలును సస్పెండ్‌ ...

Read More »

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన కళాశాల సెక్రెటరీ విశ్వనాథం మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం చాలా విలువైందని, సమాజానికి విలువను ప్రసాదించే ఉపాధ్యాయులను గౌరవించుకుంటే సమాజాన్ని గౌరవించుకున్నట్టే అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు భవిష్యత్తులో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కావాలనే లక్ష్యంతో పనిచేయాలని అన్నారు. ప్రిన్సిపాల్‌ రసీద్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను కాపాడాలని, సమాజ ...

Read More »

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం భేష్‌

– చిత్ర రాంచంద్రన్‌ కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ పథకం పనులు చురుకుగా సాగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ చిత్ర రామచంద్రన్‌ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కృష్ణానగర్‌ తాండా, బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ తాండాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని, ఇదివరకే కొన్నిచోట్ల లబ్దిదారులకు ఇళ్లు అప్పగించామని ...

Read More »

టి మాస్‌ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి మాస్‌ జిల్లా ఆవిర్భావ సభకు సంబంధించిన గోడప్రతులను గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 10న కామరెడ్డిలో ఉదయం 11 గంటలకు మునిసిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ ఉంటుందన్నారు. 12 గంటలకు పార్శిరాములు కళ్యాణమండపంలో సబ ఉంటుందని తెలిపారు. సభ విజయవంతం కోసం జిల్లలోని కమ్మరి, కుమ్మరి, ఎంఆర్‌పిఎస్‌, టిఎంఆర్‌పిఎస్‌, అంబేడ్కర్‌ యువజన సంఘాలు, వివిధ రంగాల ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. ...

Read More »

గౌరీ లంకేశ్‌ను హత్యచేసిన నిందితులను శిక్షించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ను హత్యచేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని టియుడబ్ల్యుజే ఐజెయు కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో లంకేశ్‌ మృతికి సంతాపం తెలిపి అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగుళూరులో గౌరీ లంకేశ్‌ హత్యకు గురికావడం గర్హణీయమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను త్వరితగతిన పూర్తిచేయాలి

  – హౌజింగ్‌ ప్రత్యేక చీఫ్‌ సెక్రెటరీ చిత్ర రామచంద్రన్‌ కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పురోగతిలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా అన్ని మౌలిక సదుపాయాలతో త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్దంగా ఉంచాలని హౌజింగ్‌ ప్రత్యేక చీఫ్‌ సెక్రెటరీ చిత్ర రాంచంద్రన్‌ సూచించారు. జిల్లాలో బాన్సువాడ, బీర్కూర్‌, బైరాపూర్‌ మండలాల్లో పురోగతిలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాన్ని బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన ఆమె కలెక్టరేట్‌లో మొక్కలు నాటి ...

Read More »

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

  – గుత్ప ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నందిపేట, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నందిపేట మండలం ఉమ్మెడ పాత గ్రామంలో ఉన్న గుత్ప ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేయడానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పంప్‌హౌజ్‌ మోటారు స్విచ్‌ ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ఎంపి కల్వకుంట్ల కవిత, ...

Read More »

నందిపేటలో కొనసాగుతున్న పోలీసు పికెటింగ్‌

  నందిపేట, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో విధించిన 144 సెక్షన్‌ గురువారం సాయంత్రం ముగియనుంది. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసు కమీషనర్‌ కార్తికేయ పది పోలీసు పికెటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమీషనర్‌, కలెక్టర్‌లు నందిపేటను సందర్శించి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించడంతో గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. రెండ్రోజుల నుంచి ప్రశాంతంగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ...

Read More »