Breaking News

Daily Archives: September 8, 2017

ముదిరాజ వాణి మాసపత్రిక ఆధ్వర్యంలో పరిచయ వేదిక

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదిరాజ వాణి మాసపత్రిక ఆధ్వర్యంలో ముదిరాజ్‌ యువతీ యువకుల కోసం వధూవరుల పరిచయ వేదిక నిర్వహించనున్నట్టు కార్యనిర్వాహకుడు పిప్పరి రత్నం తెలిపారు. సిద్దిపేటలో ఈనెల 10న ఉదయం 10 గంటలకు బైరి అంజయ్య గార్డెన్‌, పొన్నాల దాబాల వద్ద కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ముదిరాజ్‌ కులస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బైరి కిసన్‌, సుతారి రాజు, పిండ్యాల రాజన్న, రాజు, యాదగిరి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అంగన్‌వాడి టీచర్లకు గ్రాట్యుటి నిర్ణయించాలి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి టీచర్లకు రూ. 3 లక్షలకు, హెల్పర్లకు రూ. 2 లక్షలు గ్రాట్యుటి నిర్ణయించాలని తెలంగాణ అంగన్‌వాడి వర్కర్స్‌టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన అంగన్‌వాడి టీచర్లకు రూ. 60 వేలు, హెల్పర్లకు రూ. 30 వేలు చెల్లిస్తామని ఇటీవల పత్రికల్లో వచ్చిందన్నారు. అంత తక్కువ చెల్లింపు ...

Read More »

నాణ్యతతో కూడిన విద్య అందించడమే లక్ష్యం

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా స్థాపించిన తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన, దళిత, మైనార్టీ, బిసి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 522 గురుకుల పాఠశాలలను ప్రారంభించుకున్నట్టు తెలిపారు. కళాశాలకు మొత్తం 3 సంవత్సరాల కోర్సులకు 960 సీట్లు మంజూరయ్యాయన్నారు. ...

Read More »

3 లక్షల మందికి 1500 కోట్లు కళ్యాణలక్ష్మి కింద పంపిణీ

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు 3 లక్షల మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద 1500 కోట్లు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్దిదారులకు చెక్కులను పంపినీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు, వారి వివాహానికి అయ్యే ఖర్చు కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, ...

Read More »

విద్యార్థులు వ్యక్తిత్వ నైపుణ్యాన్ని విస్తృత పరుచుకోవాలి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థి తనలో ఉన్న సహజసిద్దమైన వ్యక్తిత్వ నైపుణ్యతను గుర్తించి దాన్ని విస్తృత పరుచుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్స్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన రెండోవిడత ఇంపాక్ట్‌ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 8 నుంచి 10 వరకు మూడురోజులు తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు ...

Read More »

ఇస్సాపల్లి ఘటన నిందితులకు బార్‌ అసోసియేషన్‌ సహకరించొద్దు

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇస్సాపల్లి గ్రామంలో దళితులపై దాడిచేసిన నిందితులను దళిత, ప్రజా సంఘాల ఒత్తిడిమేరకు ఎట్టకేలకు ఏడుగురిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించడాన్ని స్వాగతిస్తున్నామని దళిత, ప్రజాసంఘాల నాయకులు బి.దేవరాం, పిసి భోజన్న, తెడ్డు రవికిరణ్‌, వెంకటేశ్‌, టి. కుమారస్వామి అన్నారు. ఆర్మూర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితుల పట్ల వివక్షాపూరిత వైఖరితో హేళన చేస్తు మూకుమ్మడిగా ఇంటిపై దాడిచేసి మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన నిందితులను పోలీసులు ఘటన ...

Read More »

కంటి పరీక్ష పక్షోత్సవాలపై వ్యాసరచన పోటీలు

  పిట్లం సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో లయన్స్‌ క్లబ్‌ శాఖ వారు శుక్రవారం పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్ష పక్షోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జడ్పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో లయన్స్‌ అధ్యక్షుడు సంతోష్‌ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులచే నేత్రదానం మహాదానం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లయన్స్‌ జోన్‌ ఛైర్మన్‌ వేణు, డాక్టర్‌ మల్లేశం, ఉపాధ్యాయులు ప్రమోద్‌, గణేష్‌, రామకృస్ణ తదితరులు ఉన్నారు.

Read More »

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వయంపాలన దినోత్సవం

  పిట్లం, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వయంపాలన దినోత్సవాన్ని కళాశాల విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఇందులో భాగంగా విద్యార్తులు అధ్యాపకులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ విజయానంద్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, నరేశ్‌, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, మురళి, రాజారాం, రమా, స్వరూప, తదితరులున్నారు.

Read More »