Breaking News

Daily Archives: September 12, 2017

18 నుంచి బతుకమ్మ చీరల పంపినీ

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర మహిళలకు నజరానాగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఈనెల 18వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్టు గ్రామ సర్పంచ్‌ నర్సయ్య తెలిపారు. ఈనెల 18 నుంచి గ్రామంలోగల చౌకధరల దుకాణంలో చీరల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన యువతుల నుంచి అన్ని వర్గాల వారికి పంపిణీ చేస్తామని, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు పేరు నమోదై ఉండాలన్నారు. 18, 19, 20 మూడురోజుల ...

Read More »

గౌడ కులస్తుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని తెలుగునాడు కల్లుగీత కార్మి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరగోని గజేంద్రగౌడ్‌, జాతీయ అధ్యక్షుడు కొయ్యాడ స్వామిగౌడ్‌ డిమాండ్‌చేశారు. మంగళవారం కామరెడ్డిలో వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం గౌడ కులస్తులను, గీత కార్మికులను కుట్రపూరితంగా అణిచివేయాలని చూస్తుందన్నారు. అందుకు నిదర్శనంగా కల్తీకల్లు నెపంతో కల్లు దుకాణాలపై దాడులు చేస్తు అక్రమ కేసులు బనాయిస్తు జైలుకు పంపుతుందన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన ...

Read More »

కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యుల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా రచయిత కంచె ఐలయ్య చేసిన రచన, వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కామారెడ్డిలో ఆర్యవైశ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఐలయ్యకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఐలయ్య తన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని, పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు చీల ప్రభాకర్‌, ముప్పారపు ఆనంద్‌, రమేశ్‌ గుప్త, జూలూరి సుధాకర్‌, అనిల్‌, కాంశెట్టి, మోత్కురి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ పక్కాగా జరపాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో బతుకమ్మ పండగను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని, చీరలను పకడ్బందీగా పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బతుకమ్మ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిదులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18, 19 తేదీల్లో బతుకమ్మ చీరల పంపిణీ పూర్తిచేయాలన్నారు. 20న బతుకమ్మలు ప్రారంభించి 28 వరకు నిర్వహించాలని సూచించారు. విజేతలకు వివిధ బహుమతులు అందజేయాలని చెప్పారు. వీక్లిమార్కెట్లో ...

Read More »

డ్వాక్రా సంఘాలు బలోపేతం చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా సంఘాలు బలోపేతం చేయాలని సిఆర్‌పి సునిత అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులోగల మైత్రి సమాఖ్య మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి మహిళల ఆర్థిక పరిపుష్టికి సహకారం అందించాలన్నారు. డ్వాక్రాగ్రూపుల్లో లావాదేవీలు పెంచాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కౌన్సిలర్‌ రేణుక, సిఆర్‌పి రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఐదోరోజుకు చేరిన ఆర్టీసి కార్మికుల సమ్మె

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసి తెలంగాణ మద్నూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి. నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా ప్రజలకు అవసరమైన సర్వీసులను పెంచాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని, తదితర డిమాండ్లతో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. దీక్షలో శ్రీనివాస్‌, శంకరయ్య, సుభాష్‌రెడ్డి, ఆఫీస్‌, అశోక్‌లు కూర్చున్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నారాయణ, సంగారెడ్డి, గోపాల్‌, హరీష్‌, అజర్‌ అలీ తదితరులు ...

Read More »

బుధవారం రాత్రి పల్లెనిద్ర

  నందిపేట, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుధవారం రాత్రి మండలంలోని వెల్మల్‌ గ్రామంలో ప్రజాదర్బార్‌, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జీవనన్న యువసేన అధ్యక్షుడు మహేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేయని వినూత్న రీతిలో పల్లెనిద్ర, ప్రజాదర్బార్‌ కార్యక్రమం ద్వారా దళితవాడలో నిద్రపోతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వెనువెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు.

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

  నందిపేట, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడెంటిటి కార్డులు, నోటుపుస్తకాలు లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దాత చేపూరు నారాయణ చేతుల మీదుగా పంపిణీ చేసినట్టు క్లబ్‌ అధ్యక్షుడు గంగాదర్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్తెన్న, ఉపాధ్యాయులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ఎమ్మెల్యేను కలిసిన కోమట్‌పల్లి వాసులు

  నందిపేట, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కోమట్‌పల్లి వాసులు మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి గ్రామ సమస్యలు వివరించారు. అభివృద్ది పనులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలోని రామాలయానికి రూ. 12 లక్షల 50 వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా నికాల్‌పూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా కోమట్‌పల్లి గ్రామ చెరువు నింపడానికి కావాల్సిన పైప్‌లైన్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంజీవ్‌, ...

Read More »

ఉచిత సంస్కృత భాషా ప్రశిక్షణ తరగతులు

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో వేల సంఖ్యలో భాషలున్నాయని, వాటన్నింటికి మూలం భారతీయ సంస్కృత భాష అని ఆచార్య వేదమిత్ర అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అటువంటి అన్ని భాషలకు తల్లిఅయిన సంస్కృత భాషను అందరు నేర్చుకోవాలనే సంకల్పంతో ఉచిత ప్రశిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 27 వరకు వారంరోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంటపాటు ఉచిత ప్రశిక్షణ ...

Read More »

ఐలయ్య పుస్తకంపై వైశ్యుల ఆగ్రహం

ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై గరమైతున్నారు ఆర్యవైశ్యులు. ఆయన రాసిన.. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు పుస్తకం తమను కించపరిచెటట్టు ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు ఆర్యవైశ్యులు. ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు పెట్టారు.  ఆయన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరిలో.. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాల ఆర్యవైశ్యులు నిరసనకు దిగారు. కించపరిచేలా కంచె ఐలయ్య పుస్తకం రాశారని ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యులను స్మగ్లర్లు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో.. కంచె ఐలయ్య రాసిన ...

Read More »