Breaking News

Daily Archives: September 13, 2017

చెవిలో పువ్వుతో ఆర్టీసి కార్మికుల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు నిర్వహిస్తున్న ఆమరణ రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి ఆరో రోజకు చేరుకున్నాయి. దీక్షలో చెవిలో పువ్వు పెట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పునరుద్దరించాలని, కొత్త పిన్‌ మిషన్‌లను తెప్పించాలని, అక్రమ సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, నూతనంగా సర్వీసులను పెంచాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సునంద, బాలమణి, పుష్పలత, లక్ష్మి, రామలీల, ...

Read More »

చరిత్ర, భౌగోళిక అంశాలపై పాఠకులకు శిక్షణ

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులకు బుధవారం వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తున్న వివిధ ఉద్యోగాల కోసం చదువుతున్న విద్యార్థులకు శిక్షణలో భాగంగా మూడోవారం బుధవారం డిగ్రీ లెక్చరర్‌ ఎల్లప్ప భారతదేశ నైసర్గిక స్వరూపం, స్వాతంత్య్ర సమర చరిత్ర, ప్రస్తుత విషయాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఛైర్మన్‌ ఎం.రాజేశ్వర్‌ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ఎలా సమాయత్తం ...

Read More »

గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశమందిరంలో రాష్ట్రంలోని జిల్లా గిరిజన సంక్షేమాభివృద్ది అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌ లక్ష్మణ్‌ నాయక్‌ సమీక్ష సమావేశం నిర్వహించినట్టు జిల్లా గిరిజన అభివృద్ది అధికారి గంగాధర్‌ తెలిపారు. రెండు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తారన్నారు. ఇందులో 8 సెక్టార్లకు చెందిన విషయాలను ప్రతి జిల్లా అధికారులతో సమీక్షించారన్నారు. కొత్త మెనును ప్రతి వసతి గృహంలో అమలు చేయాలని, పెయింటింగ్‌ వేయించాలని ఆదేశించినట్టు తెలిపారు. కళాశాలల్లో పోస్టు మెట్రిక్‌ ...

Read More »

ఆరోగ్యశ్రీ కార్డులు అందజేత

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బుధవారం ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేశారు. గాంధారి మండలం మాధవపల్లి గ్రామస్తుడు నార్ల కృష్ణమూర్తి మంగళవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేదరికం నుంచి వచ్చిన కృష్ణమూర్తి కుటుంబీకుల అభ్యర్తన మేరకు కలెక్టర్‌ జనహిత ఫిర్యాదు కేంద్రం ద్వారా వెంటనే ఆరోగ్యశ్రీ సర్టిఫికెట్‌ రూపొందించి బుధవారం ...

Read More »

సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 26వ వార్డు వశిష్ట డిగ్రీ కళాశాల రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌టి నిధులు రూ. 3 లక్షలతో సిసి రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టరును ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ మోతె కృష్ణాగౌడ్‌, ఎ.ఇ. గంగాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

19 లోగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19లోగా అర్హులైన మహిళలందరికి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని తహసీల్దార్లు, మండల అభివృద్ది అధికారులు, ఎపిఎంలు, విద్యాశాఖ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. బతుకమ్మ చీరలు, పండుగ ఏర్పాట్లు, స్వచ్చత, ఈసేవా, ఓడిఎఫ్‌, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమీక్షించారు. జిల్లాకు కావాల్సిన 3 లక్షల 31 వేయి 214 బతుకమ్మ చీరలు తమకు అందాయన్నారు. వాటిని ఈనెల 18, 19 లోగా ...

Read More »

బతుకమ్మ ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన నిర్వహించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండగ ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని పెద్ద చెరువును పరిశీలించారు. చెరువుకు వెళ్లే దారి వెంట ఫ్లడ్‌ లైట్ల ఏర్పాటు, చెరువు చుట్టు పరిశుభ్రత, పారిశుద్యం పనులు, బారికేడ్ల నిర్మాణంపై సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని వీక్లిమార్కెట్‌ను పరిశీలించారు. బతుకమ్మ ఆడే మహిళలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ...

Read More »

నీటిని రక్షించుకొని భావితరానికి అందిద్దాం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నదీ జలాలను, నదులను రక్షించుకొని భావితరాలకు ఇద్దామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం ఠాగూర్‌ మెమోరియల్‌ కంటి ఆసుపత్రి, లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సేవ్‌ వాటర్‌-సేవ్‌ ఇండియా ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అంతకుముందు కంటి ఆసుపత్రిని సందర్శించి కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. బ్లడ్‌ బ్యాంకు ...

Read More »