Breaking News

Daily Archives: September 15, 2017

కాలువలో రాత్రిపూట దళారుల చేపలవేట

  నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జలవిద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువ రాత్రిపూట మధ్య దళారులు ఇష్టారాజ్యంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు టర్బయిన్‌ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, పాత కాలువకు నీరు నిలిపివేయడంతో దళారులు రాత్రిపూట చేపల వేట కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్‌, టాటా మేజిక్‌ తదితర వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి వారిని ఆదుకునేందుకు ...

Read More »

రేషన్‌ షాపు డీలర్లు ప్రజా పంపిణీలో కీలకం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ షాపు డీలర్లు ప్రజాపంపిణీ విధానంలో కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చౌకధరల దుకాణాల ఈ పాస్‌ యంత్రాలు, డీలర్ల శిక్షణ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. టెక్నాలజి పెరిగిపోతున్న రోజుల్లో రేషన్‌డీలర్లు టెక్నాలజిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా సాంకేతికతను పెంచుకోవాలని సూచించారు. రేషణ్‌ దుకాణాలను నిర్ణీత తేదీల్లో తప్పకుండా తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఈ పాస్‌ వల్ల ...

Read More »

రైతుల భూముల లెక్క పక్కాగా ఉండాలనేదే లక్ష్యం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల భూముల లెక్క పక్కాగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, దీనికి మార్గమే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లిలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 10,773 గ్రామాల్లోని 56 లక్షల రైతులకు సంబంధించిన ఒక కోటి 10 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ...

Read More »