Breaking News

Daily Archives: September 16, 2017

పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు, విద్యార్థినిలు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని, చదువుకుంటూ విజ్ఞానపరంగా ఎదగాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా మహిళ, స్త్రీ, శివు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష, ప్రచార ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సురక్ష అంటే మనము మనమే రక్షించుకోవడమని, స్వీయ రక్షణ పద్దతులు పాటించాలన్నారు. బాలికల అపహరణ, అక్రమ ...

Read More »

మత్స్యకారుల అభివృద్దికి రూ. వెయ్యి కోట్లు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ది కోసం ఎన్‌సిడిసి రుణ సహకారంతో రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కామరెడ్డి జిల్లా కోటగిరి మండలం నల్లచెరువులో ఉచిత చేపపిల్లలను వదిలారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో 72 ప్రాజెక్టులు, 26 వేల చెరువులు చేపల ...

Read More »

మినీ ట్యాంక్‌బండ్‌గా ఎల్లారెడ్డి చెరువు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం వడ్లూరు ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంకుబండుగా రూపొందిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఏనుగు రవిందర్‌రెడ్డి తెలిపారు. మినీ ట్యాంక్‌బండ్‌ రూపకల్పనకు సంబంధించి శనివారం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను కలెక్టర్‌ చాంబరులో వారు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఓ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ క్రమంలో వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును మిని ట్యాంకుబండ్‌గా రూపొందించనున్నట్టు తెలిపారు. అన్ని ...

Read More »

బతుకమ్మ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్‌

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపెద్ద చెరువు వద్ద విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, మహిళలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రత చర్యలు సైతం తీసుకోవాలని సూచించారు. మహిళలు అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట డిఇ భానుప్రకాశ్‌, ఎ.ఇ. రాంప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ముదాం గల్లికి చెందిన ముదాం నాగయ్య (65) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం, అప్పుల బాధ తాళలేక రైతు తన పంట పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  గాంధారి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో శనివారం ధన్వంతరి కంటి దవాఖాన బాన్సువాడ వారి ఆద్వర్యంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 150 మందికి పరీక్షలు జరిపి 10 మందికి మోతిబిందు ఉన్నట్టు గుర్తించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్టు కంటి వైద్యులు శివకుమార్‌ తెలిపారు.

Read More »

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో మెగా దంతవైద్య శిబిరం

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం గాదేపల్లి గ్రామంలో శనివారం ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్‌ శ్రీను నాయక్‌ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రముఖ దంత వైద్యులు గాదేపల్లి, నడ్కుడ, అన్నారం పాఠశాలల విద్యార్తులకు, గాదేపల్లి గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. దంత సమస్యలు ఉన్న విద్యార్థులకు ఉచిత మందులు, పేస్టులు, బ్రష్‌లు కూడా ఉచితంగా అందించినట్టు తెలిపారు. 200 మందికి ఉచిత ...

Read More »

విద్యార్థులకు సాప్ట్‌వేర్‌ కంపెనీ ఉపకార వేతనాలు

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఉప్పలవాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో గత సంవత్సరం 10వ తరగతిత పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్‌ కంపెనీ ద్వారా మంజూరు చేయబడిన ఉపకార వేతనాల చెక్కును సంస్థ ప్రాంతీయ అధికారిణి సింధు అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 35 వేల చొప్పున మంజూరైన ఉపకార వేతనం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

  గాంధారి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా అటవీ ప్రాంతంలో కలపను తరలిస్తున్న జీపును పట్టుకున్నట్టు గాంధారి ఎఫ్‌ఆర్‌వో గంగాధర్‌ తెలిపారు. గాందారి మండలం చద్మల్‌ బీట్‌ నుండి అక్రమంగా 7 కలప దుంగలను జీపులో ఎపి 25 టి 8142 తరలిస్తున్నట్టు శనివారం ఉదయం సమాచారం అందిందన్నారు. వెంటనే చద్మల్‌ బీట్‌ అధికారి గోపాల్‌, సిబ్బంది చందు, భూపతి, సురేశ్‌లు కాపుకాసి తిప్పారం తాండా వద్ద తనిఖీ చేయగా జీపులో తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వెంటనే జీపును కలపను ...

Read More »

ప్రభుత్వం ఐలయ్యను కఠినంగా శిక్షించాలి

  గాంధారి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్యులను కించపరిచేవిధంగా పుస్తకాన్ని వ్రాసిన కంచె ఐలయ్యను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌ అన్నారు. గాంధారి మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని కులాలను కించపరిచే విధంగా ఐలయ్య ప్రవర్తిస్తున్నారని అలాంటి వారిని శిక్షించాల్సిన అవసరముందన్నారు. ఏ కులాన్ని, మతాన్ని కించపరిచేవిధంగా మాట్లాడినా ఉద్యమాలు తప్పవన్నారు. ఐలయ్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చర్యలు ...

Read More »

20న మండల ఆర్యవైశ్యసంఘం ఎన్నికలు

  గాంధారి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20న బుధవారం గాంధారి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటిని ఎన్నుకుంటామని కైలాష్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా జరిగే ఎన్నికల్లో మండల కమిటిని ఎన్నుకుంటామని, మండల ఆర్యవైశ్యులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు యాద నాగేశ్వర్‌రావు, కామారెడ్డి అధ్యక్షుడు ఉప్పల హరిధర్‌, గాంధారి అధ్యక్షుడు కాశెట్టి కిషన్‌, బెజుగం సంతోష్‌ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Read More »

జోనల్‌ స్థాయి క్రీడాకారుల ఎంపిక

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అండర్‌-14, 17 బాలురు, బాలికల కబడ్డి, ఖోఖో ఎంపిక జడ్పిహెచ్‌ఎస్‌ మద్నూర్‌లో ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఉంటుందని ఎంఇవో రాములు తెలిపారు. జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల ఆసక్తిగల అర్హులైన క్రీడాకారులు ఎంపికకు హాజరుకావాలని సూచించారు. పిడి రాజాగౌడ్‌, పిడి సాయిలులకు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

Read More »