Breaking News

ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌సిప్‌లు మంజూరు చేయాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌, జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం టిజివిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై తీవ్ర భారం పడుతుందని కలాశాల యాజమాన్యాలు విద్యార్థులకు టిసి, బోనోఫైడ్‌లు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వాటిని విడుదల చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఓంకార్‌, సర్దార్‌, పృథ్వీ, వినీత్‌, రాజశేఖర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article