Breaking News

Daily Archives: September 18, 2017

వ్యక్తి అదృశ్యం

  నందిపేట, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఐలపురం గంగాధర్‌ (24) గత 20 రోజుల నుంచి కనిపించకుండా పోయాడని తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వెళ్లిన గంగాధర్‌ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటింకి పంపించారని, నిజామాబాద్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించగా కొంతమేర నయమైందని మల్లయ్య తెలిపారు. కాగా గత 20 రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదని, చుట్టాలు, బంధువుల ...

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 10 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపిలో 10 ఫిర్యాదులు అందినట్టు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో డయల్‌ యువర్‌ సిపి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించినట్టు తెలిపారు. కాగా నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పరిధిలో మొత్తం 10 ఫిర్యాదులు రాగా కమీషనర్‌ సానుకూలంగా స్పందిస్తు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

  నందిపేట, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మండల పరిసత్‌ అధ్యక్షురాలు అంకంపల్లి యమున అధ్యక్షతన మండల కేంద్రంలోని మండల కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ ప్రారంభించి, తర్వాత మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసిల ఆధ్వర్యంలో చీరలు పంపినీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించే ఏకైక ప్రభుత్వమని వక్తలన్నారు. ప్రతి ఒక్కరు పండగకు కొత్తబట్టలు కొనుక్కోలేదని బాధ పడకూదనే ...

Read More »

డయల్‌యువర్‌ ఎస్‌పిలో 5 ఫిర్యాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యాలయంలో ప్రజల నుంచి 5 ఫిర్యాదులు అందినట్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎస్‌పి శ్వేతారెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కామారెడ్డి-1, దేవునిపల్లి-2, ఎల్లారెడ్డి-1, తాడ్వాయి-1 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు పిర్యాదులు పరిస్కరించాలని ఎస్‌పి నివేదించినట్టు వివరించారు.

Read More »

సిసి డ్రైనేజీ పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 33వ వార్డు స్నేహపురి కాలనీలో నిర్మిస్తున్న సిసి డ్రైనేజీ పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పి.సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. లక్ష వ్యయంతో మురికి కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ భారతమ్మ, మాజీ కౌన్సిలర్‌ జూలూరి సుధాకర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు కిషన్‌, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షునిగా మార్కండేయులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కామరెడ్డికి చెందిన భక్త మార్కండేయులును నియమిస్తు సంఘం అధ్యక్షుడు బాబురావు ఉత్తర్వులు జారీచేశారు. మార్కండేయులు చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. సోమవారం మార్కండేయులుకు నియామకపత్రం అందజేశారు. మార్కండేయులు మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతికి తనవంతు కృసి చేస్తానని పేర్కొన్నారు.

Read More »

ప్రజావాణి రద్దు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీ నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చీరల పంపిణీ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిని సన్నద్దం చేసేందుకు వారు విధుల్లోకి వెళ్లిన క్రమంలో ప్రజావాణి రద్దుచేయాల్సి వచ్చిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు స్వీకరించలేదని యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని వివరించారు.

Read More »

రూ.250 కోట్లతో మహిళలకు చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండగ సందర్భంగా రూ.250 కోట్లతో తెలంగాణలోని ఆడపడుచులకు ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మండలం సోమేశ్వర్‌ గ్రామంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి 4 లక్షల 15 వేల 470 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఆడబిడ్డల కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ప్రభుత్వం ...

Read More »

చైతన్య పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య పాఠశాలలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తంగేడుపూలు, గునుగుపూలు తెచ్చి పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలు పేర్చి ఆడారు. విద్యార్థులకు పండగ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్టు పాఠశాల కరస్పాండెంట్‌ తానోబా ఆనంద్‌రావు తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు సంబరాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమిత్రానంద్‌ పాల్గొన్నారు.

Read More »

హోంగార్డ్‌ ఆత్మహత్య

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన శివ అనే హోంగార్డు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎల్లారెడ్డికి చెందిన శివ భిక్కనూరు పోలీసు స్టేషన్‌లో సిఐ జీపు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. ఆర్థిక పరిస్థితుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డానని, రాష్ట్రంలో హోంగార్డు కుటుంబాలు ఆనందంగా లేవని, తమను ముఖ్యమంత్రి క్రమబద్దీకరిస్తానని చెప్పి ఇంత వరకు చేయలేదని రాశాడు. ...

Read More »