Breaking News

Daily Archives: September 19, 2017

బార్‌ అసోసియేషన్‌ నుంచి న్యాయవాది సలీం సస్పెండ్‌

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఎం.ఎ.సలీం అనే న్యాయవాదిని బార్‌ అసోసియేషన్‌ నుంచి మూడునెలల పాటు సస్పెండ్‌ చేస్తు కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోపి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెకండ్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేసిన సలీం కాలపరిమితి ముగిసినప్పటికి మేజిస్ట్రేట్‌నని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని, సమాచార హక్కు పరిరక్షణ ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ వివరాలు అందజేయాలి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీ వివరాలను ప్రతిరోజు సాయంత్రం లోగా అధికారులు తమకు పంపాలని రాష్ట్ర చేనేత ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో బతుకమ్మ చీరల పంపిణీపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పంపిణీ కేంద్రాల నుంచి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ రాకుండా అవసరమైతే కౌంటర్లు పెంచాలని సూచించారు. పంపినీని ఈనెల 22 లోగా ముగించాలని సూచించారు. 21 లోగా ఎన్ని పంపిణీ చేశారు. ఎన్ని మిగిలాయి, ఎన్ని ...

Read More »

పాఠకులకు గణితంపై శిక్షణ

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ ఫారెస్టు ఆఫీసర్‌, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఆయా సబ్జెక్టులపై విషయ నైపుణ్యంగల ఉపన్యాసకులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం గణితంలోని త్రికోణమితి, రేఖాగణితంగురించి పోటీ పరీక్షల్లో వచ్చే వ్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది, వాటిని ఏవిధంగా మనకు ఇచ్చిన సమయంలో పూర్తిచేయాలి అనే విషయంపై హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉపన్యాసకుడు ప్రదీప్‌చంద్ర విద్యార్థులకు వివరించారు. ...

Read More »

చాముండేశ్వరి అమ్మవారి ఆలయ కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీ రుక్మిణి కుంటలోగల శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అధ్యక్షునిగా చాట్ల రాజేశ్వర్‌, ఉపాధ్యక్షులుగా సతీష్‌, బాల శ్రీనివాస్‌, కార్యదర్శులుగా రాజు, శ్రీనివాస్‌, కోశాధికారిగా శ్రీనివాస్‌, భాగ్య, సహ కార్యదర్శులుగా రాజేందర్‌, అనిల్‌, నరేశ్‌, కార్యవర్గ సభ్యులుగా సంగమేశ్వర్‌, శ్రీకాంత్‌, సంతోస్‌, నాని, మురళి, వేణు, సలహాదారులుగా లింబాద్రి, గంగాధర్‌, శంకర్‌, ...

Read More »

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం జనహిత భవనంలో మండల రైతు సమన్వయ సమితి సభ్యులతో, వ్యవసాయ అధికారులతో పత్తి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం 20 వేల 655 ఎకరాల్లో పత్తివేశారని, ఈయేడు అధికంగా 49 వేల 781 ఎకరాల్లో పత్తి వేశారని తెలిపారు. మద్నూర్‌లో కొనుగోలు కేంద్రం ఉందని, పిట్లం, కామారెడ్డి ల్లో ...

Read More »

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని హైమద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు అన్నారు. రామేశ్వర్‌పల్లిలోని టిటిసి విద్యార్థులతో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మకు విశిష్ట స్తానముందని, ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన అవసరముందన్నారు. పూలను దేవుళ్ళుగా పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు హలీఫ్‌ పాషా, శ్రీనివాసులు, స్వప్న, సత్యనారాయణ, ...

Read More »

మత్స్యసంపద నూరుశాతం మత్స్యకారులదే

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యసంపద నూటికి నూరుశాతం మత్స్యకారులదేనని వారికే చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలోని చెరువులో చేపపిల్లలను విడిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాన్సువాడ మండల పరిధిలో 14 చెరువుల్లో 19 లక్షల 73 వేల 580 చేపపిల్లలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇబ్రహీంపేట్‌ చెరువులో 2 లక్షల 67 వేల చేపపిల్లల్ని విడుస్తున్నట్టు తెలిపారు. దళారులను ...

Read More »

ఆడపిల్లకు చీరపెట్టడం సంస్కృతిలో భాగం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడబిడ్డలకు చీరపెట్టడం మన సంస్కృతిలో భాగమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని పాత బాన్సువాడ చావడి, కొత్త బాన్సువాడలోని వీక్లిమార్కెట్‌లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, ఆత్మీయతతో ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను బహుమతిగా అందించిందన్నారు. ఒక కోటి 4 లక్షల మందికి చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నిజాంసాగర్‌ నుంచి ...

Read More »

సూర్యోదయ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

  నందిపేట, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని సూర్యోదయ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గును, తంగేడు పూలతో అందంగా ముస్తాబుచేసిన బతుకమ్మను శ్రద్దతో పూజించి ఆడి పాడారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

లక్ష్మిఫిల్లింగ్‌ స్టేషన్‌లో బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డిలోని స్థానిక లక్ష్మిఫిల్లింగ్‌ స్టేషన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు యాజమాన్యం హాజి, నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అందంగా అలంకరించిన 5 ఫీట్ల బతుకమ్మను పెట్రోల్‌ పంప్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. చక్కగా విద్యుత్‌ దీపాల కాంతులతో అలంకరించి పలువుర్ని ఆకట్టుకుంటుంది బతుకమ్మ. జిల్లా కలెక్టర్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్‌ పంపుల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు ...

Read More »