Breaking News

Daily Archives: September 20, 2017

వశిష్ట కళాశాలలో బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వశిష్ట జూనియర్‌ కళాశాలలో బుధవారం బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆట ఆడారు. బతుకమ్మ గొప్పతనాన్ని కొనియాడుతూ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌, యాజమాన్యం, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Read More »

దేవీ నవరాత్రి ఉత్సవాలకు పట్టణం ముస్తాబు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు కామారెడ్డి పట్టణం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పేందుకు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దుర్గామాత మండపాల నిర్వాహకులు అద్భుతమైన సెట్టింగులు, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. సినిమాల్లో సెట్టింగులు తలపించే తీరుగా నిర్వాహకులు చూపరులను అబ్బురపరచేలా మండపాలు తయారుచేస్తున్నారు. ప్రతియేడు కంటే ఈ యేడు మండపాల ఏర్పాట్లపై దృస్టి సారించారు. ఈక్రమంలో అద్భుతమైన కళాఖండాలతో మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న అమ్మవారి ...

Read More »

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలం చిన్న గుజ్జుల్‌ గ్రామంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. రికార్డుల ప్రక్షాళన తీరును సమీక్షించారు. అధికారులను, ప్రజలను అడిగి ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యల గురించి ఆరాతీశారు. ప్రక్షాళన పకడ్బందీగా పూర్తిచేయాలని, ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రక్షాళనకు రైతులు పూర్తిగా సహకరించాలని చెప్పారు. ఆయన వెంట జడ్పిటిసి తానాజీరావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Read More »

ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై కాంగ్రెస్‌ కౌన్సిలర్ల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పరిధిలో జరిపిన ప్రారంభోత్సవాల్లో వేయించిన శిలాఫలకాలపై ప్రోటోకాల్‌ నిబందన ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు బల్దియా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిలాఫలకాల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పేరును ...

Read More »

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు మొక్కజొన్న పంటను విక్రయించుకొని లబ్దిపొందాలని తిమ్మాపూర్‌ సర్పంచ్‌ ఉగ్గెర భూమేశ్వర్‌, మోర్తాడ్‌ సొసైటీ వైస్‌ఛైర్మన్‌ కల్లం అశోక్‌, తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు చిన్న రాజేశ్వర్‌లు అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోని సహకార సంఘం వద్ద మార్క్‌ఫెడ్‌ ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ...

Read More »

కేర్‌ డిగ్రీకళాశాలలో బతుకమ్మ వేడుక

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు కలిసి ఘనంగా బతుకమ్మ వేడుక నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాలలో మొదటిరోజైన ఎంగిలిపూల బతుకమ్మను భక్తి శ్రద్దలతో పేర్చి అందంగా ముస్తాబుచేసి, గౌరమ్మను పూజించి ఆటలాడి పాటలు పాడారు. డిజె పాటలకు అనుగుణంగా లయాత్మకంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయినిలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌, ప్రిన్సిపాల్‌ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచులు ...

Read More »

మునిసిపల్‌ కార్యాలయ భవనం ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయ నూతన భవనాన్ని బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. భవనాన్ని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ప్రారంభించాల్సి ఉండగా కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి పోచారం కోటి 20 లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు 11 కోట్ల 30 లక్షలతో పట్టణ ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమానికి శంకుస్థాపన ...

Read More »

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 33 వేల 143 బతుకమ్మ చీరలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 4 లక్షల మంది ...

Read More »

మూడోరోజు బతుకమ్మ చీరల పంపిణీ

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీ మూడోరోజు మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో బుధవారం కొనసాగించారు. దర్మోరాలో సర్పంచ్‌ రాజేందర్‌, తిమ్మాపూర్‌లో సర్పంచ్‌ భూమేశ్వర్‌ చీరలు పంపిణీ చేశారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు చీరల పంపిణీకై సిబ్బంది, సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో మహిళలు ఉత్సాహంగా క్యూలైన్లలో నిలబడి చీరలు తీసుకుంటున్నారు. చీరల పంపిణీని మోర్తాడ్‌, ఏర్గట్ల తహసీల్దార్లు సూర్యప్రకాశ్‌, ముల్తజుద్దీన్‌లు పర్యవేక్షించారు.

Read More »

చురుకుగా సాగుతున్న సమగ్ర సర్వే

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న భూసమగ్ర సర్వే మండలంలోని తిమ్మాపూర్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో బుధవారం 6వ రోజు చురుకుగా కొనసాగుతుంది. ఒడ్యాట్‌లో తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ ఆధ్వర్యంలో తిమ్మాపూర్‌లో నయాబ్‌ తహసీల్దార్‌ జనార్ధన్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేసి భూసమగ్ర సర్వే అధికారులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ సర్వేపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 1-బి పహని ప్రకారం భూముల్లో సర్వే నెంబర్లు, పేర్లు తప్పులుంటే దరఖాస్తు చేసుకున్న రెండ్రోజుల్లోనే సరిచేసి ...

Read More »

నందిపేటలో నవవసంతం

  నందిపేట, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మళ్లీ పూలపండుగ వచ్చింది. తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో పూల సందడి బుధవారం నుంచి నందిపేట మండలంలో మొదలైంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పండగ 28న సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 9 రోజుల పాటు గత సంవత్సరం కంటే భారీగా పండగ జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో జరిగే ఉత్సవాలకు మహిళా సంఘాలు, తెలంగాణ ...

Read More »