Breaking News

Daily Archives: September 21, 2017

బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా వార్డుల కౌన్సిలర్లు కాలనీల్లోని మహిళలకు ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. గురువారం కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్‌, కైలాష్‌ లక్ష్మణ్‌, జమీల్‌, గణేష్‌లు వారి వార్డుల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

Read More »

ఆర్టీసి బస్టాండ్‌ ఎదుట జీవో 19 ప్రతుల దగ్దం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి టీచర్ల ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండ్‌ ఎదుట గురువారం జీవో 19 ప్రతులను దగ్దం చేశారు. అంగన్‌వాడి టీచర్లు, సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జివో 19 ప్రకారం ప్రభుత్వం అంగన్‌వాడి టీచర్లకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ 60 వేలకు బదులు 30 వేలు ఇవ్వడం సరికాదన్నారు. టీచర్లకు 3 లక్షలు, హెల్పర్లకు 2 లక్షలు, జీతంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందరికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ప్రమాదబీమా కల్పించాలని కోరారు. ...

Read More »

స్వయం సహాయక సంఘాలు స్వయం సమృద్ధిని సాధించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా స్వయం సహాయక సంఘాలు, సమాఖ్యలు స్వయం సమృద్ధిని, సుస్థిరతను సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. పర్యవేక్షణ సమాఖ్య ఐదో మహాసభ గురువారం జిల్లా కేంద్రంలోని పాత తహసీల్‌ కార్యాలయంలో జరిగింది. దీనికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల్లో అంతర్గత సామర్థ్యాలను, జవాబుదారి తనాన్ని పెంపొందించడానికి తెలంగాణ సెర్ప్‌, ఎపి మాస్‌ సంయుక్తంగా కామారెడ్డి క్లస్టర్‌లో పరస్పర పర్యవేక్షణ సమాఖ్యను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. మండలానికి ...

Read More »

విద్యార్థులు స్వశక్తితో ఎదగడానికి కృషి చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ఉద్యోగమే ప్రథమ లక్ష్యం కాకుండా స్వశక్తితో ఎదిగేందుకు కృసి చేయాలని తెలంగాణ ఇంటర్‌ సెన్యుయర్స్‌ మోటివేషనల్‌ అండ్‌ ప్రమోషనల్‌ ఆర్గనైజేషన్‌ (టెంపో) రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సెల్ప్‌ డెవలప్‌మెంట్‌, లక్ష్యసాధన అనే అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగమే ప్రథమ లక్ష్యంగా అన్వేషణ ప్రారంభిస్తారని, అలాకాకుండా తమ ఆలోచనే పెట్టుబడిగా మార్చి ...

Read More »

ఘనంగా బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లిమార్కెట్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో గురువారం జబర్ధస్త్‌ ఫేమ్‌ చమ్మక్‌ చంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు, మహిళలు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు.

Read More »

50 పడకల ఆసుపత్రికి రూ. ఏడుకోట్లు మంజూరు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు గాను కొత్తగా 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఏదుకోట్లు మంజూరయ్యాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వెంటనే టెండరు ప్రక్రియ ద్వారా పనులు ప్రారంభించాలన్నారు. తనిఖీ సందర్బంగా రోగులు ఆసుపత్రి బయట అపరిశుభ్ర పరిసరాల్లో భోజనం చేయడం, షెడ్లు లేకపోవడంపై స్పందిస్తు వెంటనే ఇఇఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని, తాత్కాలిక షెడ్డు నిర్మించాలని ఆదేశించారు. తాగునీరు సరఫరా చేసేందుకు ...

Read More »

తెరాసలో పలువురి చేరిక

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం మండలంలోని పలు అభివృద్ది పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మల్లెల ...

Read More »

ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆద్వర్యంలో దాతల విరాళాలతో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైలపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బీర్కూర్‌లో నార్ల భరత్‌రాజ్‌ విగ్రహదాతగా హనుమాన్‌ ఆలయ కమిటీలో దుర్గామాతను ఏర్పాటు చేశారు. మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ఆలయం వరకు అమ్మవారిని ఘనంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. గురుస్వామి రత్నకంటి ప్రకాశ్‌ ఆద్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత ...

Read More »